Bigg Boss 8 Telugu Finale Live: బిగ్ బాస్ విన్నర్‌ ఎవరంటే? బయటకు వచ్చిన లీకులు

Basha Shek

|

Updated on: Dec 15, 2024 | 8:53 PM

Bigg Boss Telugu season 8 Grand Finale Live Updates: సుమారు 3 నెలల పాటు రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆఖరి అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారం (డిసెంబర్ 15)తో ఎండ్ కార్డ్ పడనుంది.

Bigg Boss 8 Telugu Finale Live: బిగ్ బాస్ విన్నర్‌ ఎవరంటే? బయటకు వచ్చిన లీకులు
 Bigg Boss 8 Telugu Grand Finale

LIVE NEWS & UPDATES

  • 15 Dec 2024 08:48 PM (IST)

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ట్రోఫీ ఆవిష్కరణ

    బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ట్రోఫీని నాగార్జున ఆవిష్కరించారు. 8 ఆకారంతోపాటు కన్ను సింబల్ వచ్చి.. ఇన్ఫినిటీ గుర్తు చూపిస్తూ ట్రోఫీ ఉంది. మరి దీనిని ఎవరు అందుకుంటారో మరికాసేపట్లో తేలనుంది.

  • 15 Dec 2024 08:39 PM (IST)

    బిగ్ బాస్ విజేత ఎవరంటే?

    మరికాసేపట్లో బిగ్ బాస్ సీజన్ 8 విజేతను ప్రకటించనున్నారు. అయితే అప్పుడే విన్నర్ ఎవరనే లీక్ బయటకు వచ్చేసింది. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా అవతరించాడని తెలుస్తోంది. తెలుగబ్బాయి గౌతమ్‌ రన్నరప్ టైటిల్‌తోనే సరిపెట్టుకున్నాడని సమాచారం.

  • 15 Dec 2024 08:11 PM (IST)

    గీతా మాధురి సందడి..

    ఇక బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేలో సెలబ్రిటీలు ఒక్కొక్కరూ వస్తున్నార. ఇందులో స్టార్ సింగర్స్ కూడా సందడి చేశారు. సింగర్ గీతా మాధురి కూడా తన పాటలతో బిగ్ బాస్ ఆడియెన్స్ ను అలరించింది.
  • 15 Dec 2024 08:09 PM (IST)

    విన్నర్ ప్రైజ్ మనీని చూపించిన నాగార్జున

    బిగ్ బాస్ తెలుగు సీ జన్ 8 గెలుచుకోబోయే ఫ్రెజ్ మనీని చూపించారు నాగార్జున.  మొత్తం 54,99,999 కాగా రౌండ్ ఫిగర్ చేసి రూ. 55 లక్షలుగా ప్రైజ్ మనీని నిర్ణయించారు.

  • 15 Dec 2024 08:01 PM (IST)

    105 రోజుల బిగ్ బాస్ సీజన్ 8 జర్నీ వీడియో

    105 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 జర్నీ వీడియోను గ్రాండ్ ఫినాలో ప్లే చేశారు. కంటెస్టెంట్స్ కొట్టుకోవడం, తిట్టుకోవడం, సంతోషంగా ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను ఈ వీడియో లో చూపించారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు.
  • 15 Dec 2024 07:55 PM (IST)

    స్పెషల్ డ్రెస్ తో టేస్టీ తేజ హంగామా..

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసమే స్పెషల్‌గా డ్రెస్ డిజైన్ చేసుకుని వచ్చానని టేస్టీ తేజ నాగ్ తో చెప్పాడు. దీనికి స్పందించిన అక్కనేని హీరో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  ‘వైట్ కలర్, హారిజాంటల్ లైన్స్ లావుగా ఉన్నవాళ్లకు సూట్ కావు. ముందు పెళ్లి చేసుకో అప్పుడు నేను నీకు ఏం వేసుకోవాలో చెబుతాను’ అని రిప్లై ఇచ్చాడు.

  • 15 Dec 2024 07:50 PM (IST)

    పుష్ప 2 సాంగ్‌కి గౌతమ్ డ్యాన్స్..

    బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేలో టైటిల్ ఫేవరెట్ గౌతమ్ పుష్ప సాంగ్‌కి దుమ్ములేపే స్టెప్స్ వేశాడు. గొడ్డలి పట్టుకుని ఎనర్జిటిక్ స్టెప్పులేశాడు.  అతడి తర్వాత నబీల్.. ఇస్మార్ట్ శంకర్ సాంగ్‌కి స్టెప్స్ వేశాడు. తర్వాత అవినాష్, నిఖిల్, ప్రేరణలు కూడా తమదైన శైలిలో డ్యాన్స్ లు చేస్తూ షో ను రక్తి కట్టించారు.
  • 15 Dec 2024 07:34 PM (IST)

    అతనే విన్నర్ గా నిలవాలి..

    కాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో చాలా మంది గౌతమ్ విన్నర్ గా నిలవాలని ఆకాంక్షించారు. అదే సమయంలో నిఖిల్ గెలిస్తే బాగుంటుందని మరికొందరు కోరుకుంటున్నారు.

  • 15 Dec 2024 07:20 PM (IST)

    ఆ ముగ్గురు తప్ప.. అందరూ వచ్చేశారు..

    ఈ సీజన్ లో  ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. మొదటివారం నుంచి ఎలిమినేట్ అయిన వరుస క్రమంలోనే కూర్చోగా.. నాగార్జున వారితో మాట్లాడించారు. కాగా విష్ణుప్రియ, హరితేజ, నయని పావని మాత్రం ఫినాలేకు డుమ్మా కొట్టేశారు.

  • 15 Dec 2024 07:19 PM (IST)

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రారంభం..

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా మొదలైంది. ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున స్టైలిష్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చారు.  దేవర మూవీలోని పెళ్లి డాన్స్‌తో మన్మథడు అలరించారు

  • 15 Dec 2024 07:06 PM (IST)

    మొబైల్ ఫోన్లపై నిషేధం

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశార నిర్వాహకులు.  కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్‌ కళ్లకి గంతలు కట్టి మరీ షూటింగ్  స్పాట్ కు తీసుకుని వెళ్తున్నారట. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి ఫోన్లు కూడా తీసుకుంటున్నారట. విన్నర్ ఎవరనే లీక్ బయటకు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బేబక్క ఓ వీడియో షేర్ చేసింది.

    బెజవాడ బేబక్క షేర్ చేసిన వీడియో..

  • 15 Dec 2024 06:54 PM (IST)

    చీఫ్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్.. అధికారిక ప్రకటన..

    బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ వస్తున్నట్లుగా అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ మేరకు స్టార్ మా ఒక వీడియోను షేర్ చేసింది..

  • 15 Dec 2024 06:48 PM (IST)

    అన్నపూర్ణ స్డూడియోస్ వద్ద భారీ బందో బస్తు

    గత సీజన్‌ గ్రాండ్ ఫినాలే సందర్భంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని ఈసారి అన్న పూర్ణ స్టూడియోస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ర్యాలీలు, విజయోత్సవాలకు పర్మిషన్ ఇవ్వలేదు.  అలాగే విన్నర్, రన్నర్‌ని రాత్రికి అన్నపూర్ణ స్టుడియోస్‌లోనే ఉంచి.. తెల్లవారుజామున 3 తరువాతే  బయటకు పంపించనున్నారు

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. 105 రోజుల పాటు రసవత్తరంగా సాగిన ఈ రియాలిటీషో తుది అంకానికి చేరుకుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సీజన్ 8 విజేతను ప్రకటించనున్నారు. కాగా ఈసీజన్ లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. మొదట 14 మంది మెయిన్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాగా, ఐదు వారాల తర్వాత మరో 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక చివరకు ఐదుగురు మిగిలారు. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ రేసులో నిలిచారు. మరి వీరిలో ఎవరు రూ.55 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకోనున్నారు? ఎవరు రన్నరప్‌గా నిలవనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే టీవీ 9 తెలుగును ఫాలో అవ్వండి.. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం అందించేందుకు రెడీగా ఉంది.

Published On - Dec 15,2024 6:46 PM

Follow us
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...