బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటకే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా, ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. కాగా బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్నాడు నాగ మణికంఠ. లాంచింగ్ ఎపిసోడ్ లో చాలా మందిలాగే తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడీ కంటెస్టెంట్. అదే సమయంలో తన భార్య శ్రీ ప్రియ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కూడా హౌస్ లో పలుసార్లు తన సతీమణ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాగ మణికంఠ పెళ్లి ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా అతని భార్య ప్రియా సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. దీంతో మరోసారి నాగ మణికంఠ పేరు నెట్టంట ట్రెండ్ అవుతోంది. ఇంతకు మణికంఠ వైఫ్ షేర్ చేసిన పోస్ట్ లో ఏముందంటే.. ‘సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిది’ అని ఉంది. అలాగే మరొక పోస్ట్ లో ‘భార్యా,భర్తలు తరచూ గొడవలు పడటం వల్ల.. అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్లకి కడుతూ.. ఆలోచింపజేసేలా ఒక ఫొటోని కూడా షేర్ చేసింది. ‘చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి.. ఇది చాలా పవర్ ఫుల్ ఫొటో. భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది’ అని రెండో పోస్ట్ లో ఉంది.
ప్రస్తుతం నాగమణికంఠ భార్య షేర్ చేసిన పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూస్తుంటే.. నాగ మణికంఠ, ప్రియకి మధ్య మనస్పర్థలు ఉన్నాయని తెలుస్తోంది. పెళ్లై కూతురు పుట్టిన తరువాత.. మణికంఠ ప్రియతో గొడవలు పడటం.. అది విడాకుల వరకూ వెళ్లామని ఇది వరకే చెప్పుకొచ్చాడు నాగ మణికంఠ. ఆ తర్వాత తన భార్య, కూతుర్ని వదిలిపెట్టి ఇండియా వచ్చేయడం.. డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయానంటూ తన ఆవేదనను వెళ్లగక్కాడు. మరి ఇప్పుడు శ్రీ ప్రియ ఇలా క్రిప్టిక్ పోస్టులు షేర్ చేయడంతో మణికంఠ- ప్రియల విడాకుల వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.