Pallavi Prashanth: ‘సంతోషం లేకుండా చేస్తుర్రు.. ఏడుద్దామంటే భయంగా ఉంది’.. విమర్శలపై పల్లవి ప్రశాంత్ రియాక్షన్..
ప్రశాంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు వందలాది మంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకుని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ రన్నరప్ అమర్ దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు. అతడి తల్లి, భార్య కారులో ఉండగానే.. కారు అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. ఆర్టీసీ బస్ అద్దాలను బద్దలకొట్టారు. గీతు రాయల్, శోభా శెట్టి, అశ్విని కార్లను ధ్వంసం చేశారు. అసభ్యకరంగా మాట్లాడతూ నానా రచ్చ చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా.. కామన్ మ్యాన్‌గా సీజన్ 7లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. కానీ విన్నర్ అయ్యాడనే సంతోషం ఐదు నిమిషాలు కూడా లేకుండా చేశారు అతడి ఫ్యాన్స్. ప్రశాంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు వందలాది మంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకుని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ రన్నరప్ అమర్ దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు. అతడి తల్లి, భార్య కారులో ఉండగానే.. కారు అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. ఆర్టీసీ బస్ అద్దాలను బద్దలకొట్టారు. గీతు రాయల్, శోభా శెట్టి, అశ్విని కార్లను ధ్వంసం చేశారు. అసభ్యకరంగా మాట్లాడతూ నానా రచ్చ చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తనపై వస్తున్న నెగిటివిటీపై స్పందించాడు పల్లవి ప్రశాంత్.
ట్రోఫీ గెలిచిన అనంతరం తన ఊర్లో అడుగుపెట్టాడు ప్రశాంత్. బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన ప్రశాంత్‌కు అతడి ఊర్లో ఘన స్వాగతం లభించింది. కారులో ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్ అభిమానులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. రెండు రాష్ట్రాలోని పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రశాంత్ ఇంటి వద్దకు చేరుకున్నాయి. అయితే తనపై వస్తున్న విమర్శలపై ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశాంత్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
View this post on Instagram
“అన్న నేను మళ్లా వచ్చినా.. నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ బాధపడే రోజు. రైతుబిడ్డ గెలిచిండని నా ఊరు ఘన స్వాగతం పలికింది అన్నా.. మీడియా మిత్రులు చూసిర్రు.. ఇంతమంది ప్రజలు నా కోసం వచ్చిర్రా.. నన్ను గెలిపించిర్రు అని ఎంతో సంతోషించినా.. కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీరు అనుకుంటుర్రు. నిజంగానే బాధగా ఉంది. ఏడుద్దామంటే మీరు నెగిటివ్ చేస్తారేమోనని భయంగా ఉంది. నా కోసం 60-70 యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. వచ్చిన వారందరికి ఫోటోస్, వీడియోస్ ఇచ్చినా.. అన్నం కూడా తినలేదు.. నాతో అయితలేదు అని చెప్పినా వినలేదు. 5 నిమిషాలు ఇవ్వు.. 10 నిమిషాలు ఇవ్వు అంటూ వెట్టపడ్డారు. నేను మనిషినే కదా అన్నా” అంటూ తన ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.