Jabardasth Avinash: తండ్రికానున్న జబర్దస్త్ అవినాశ్.. మెటర్నిటీ ఫొటోషూట్‌లో మెరిసిన భార్య.. ఫొటోస్ చూశారా?
తాజాగా అవినాశ్ దంపతులు మెటర్నిటీ ఫొటోషూట్‌లో మెరిశారు. కలర్ ఫుల్ డ్రెస్‌లో ఎంతో గ్లామరస్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించారీ లవ్లీ కపుల్. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అవినాశ్ దంపతులు. ఈ సందర్భంగా అవినాశ్ సతీమణి అనూజ అమ్మతనాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానంటూ పేర్కొంది
ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య అనూజ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. కొన్ని రోజుల క్రితమే అనూజ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. జబర్దస్త్ కమెడియన్లతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అవినాశ్- అనూజ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. తాజాగా అవినాశ్ దంపతులు మెటర్నిటీ ఫొటోషూట్‌లో మెరిశారు. కలర్ ఫుల్ డ్రెస్‌లో ఎంతో గ్లామరస్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించారీ లవ్లీ కపుల్. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అవినాశ్ దంపతులు. ఈ సందర్భంగా అవినాశ్ సతీమణి అనూజ అమ్మతనాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానంటూ పేర్కొంది..’ గర్బంలో బిడ్డను మోయడమనేది నా జీవితంలో ఒక అందమైన మరుపురాని అనుభూతి. ఈ ప్రేమ నిజమైనది. శాశ్వతమైనది. అమ్మతనాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది అనూజ. ప్రస్తుతం అవినాశ్- అనూజ దంపతుల మెటర్నిటీ ఫొటోషూట్ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, అభిమానులు, నెటిజన్లు అవినాశ్ దంపతులకు అభినందనలు చెబుతున్నారు.
అవినాశ్- అనూజ దంపతులు 2021 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. అవినాశ్- అనూజల అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా ఈ ఏడాది జులై లో అనూజ గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అవినాశ్ దంపతులే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. కాగా జబర్దస్త్ షోతో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాశ్. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అంటూ హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.
అవినాష్ దంపతుల మెటర్నిటీ ఫొటో షూట్..
View this post on Instagram
కలర్ ఫుల్ డ్రెస్ లో మెరిసిన దంపతులు..
View this post on Instagram
ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ లో హీరోగా ముక్కు అవినాశ్.. త్వరలోనే మూవీ రిలీజ్
View this post on Instagram
మరిన్ని తాజా సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.