Ritu Chaudhary: ఆ వీడియోలను లీక్ చేశారు.. నన్ను టార్చర్ చేశారు.. ఎమోషనల్ అయిన రీతూ చౌదరి
ఈ అమ్మడు జబర్దస్త్ లో కొన్ని షోల్లో కనిపించింది. ఆ తర్వాత పలు షోల్లోనూ కనిపించింది ఈ భామ. అంతే కాదు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటో షూట్స్ తో పాటు వీడియోలతో అలరిస్తుంది రీతూ చౌదరి. ఈ అమ్మడి అందానికి నెటిజస్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు తనకు ఎదురైనా అనుభవాలగురించి చెప్పుకొచ్చింది.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా మంది ఫెమస్ అయిన విషయం తెలిసిందే. కొంతమందికి సినిమాల్లో ఛాన్స్ లు కూడా వచ్చాయి. ఇక చాలా మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యారు. అలాగే సోషల్ మీడియాలో పాపులర్ అయిన బ్యూటీల్లో రీతూ చౌదరి ఒకరు. ఈ అమ్మడు జబర్దస్త్ లో కొన్ని షోల్లో కనిపించింది. ఆ తర్వాత పలు షోల్లోనూ కనిపించింది ఈ భామ. అంతే కాదు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటో షూట్స్ తో పాటు వీడియోలతో అలరిస్తుంది రీతూ చౌదరి. ఈ అమ్మడి అందానికి నెటిజస్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు తనకు ఎదురైనా అనుభవాలగురించి చెప్పుకొచ్చింది. రీతూ చౌదరికి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. తాజాగా ఆ ఛానెల్ లో ఓ వీడియో షేర్ చేసింది.
రీతూ చౌదరి తండ్రి ఇటీవలే మరణించారు.. దాంతో ఇంటిబాధ్యతలన్నీ తానే చూసుకుంటుంది. అలాగే ఇటీవలే ఓ కొత్త ఇల్లు కొన్నది. అయితే ఓ ఇంటీరియర్ డిజైనర్ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెప్పుకొచ్చింది రీతూ. అలాగే కొంతమంది తన వీడియోలను, ఫోటోలను మార్ఫింగ్ చేశారని తెలిపింది.
అయితే తన వీడియోలు మార్ఫింగ్ చేసిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపింది. రీతూ మాట్లాడుతూ.. నా ఫోటోలను, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతే కాదు నన్నే ట్యాగ్ చేసి పైశాచిక ఆనందం పొందారు అని తెలిపింది. అలాగే నేను సోషల్ మీడియాలో నేను ఏం పెట్టినా కొంతమంది చాలా దారుణంగా కామెంట్స్ చేశారు. ఇది జరిగిన దాదాపు ఐదు నెలలైంది. అతిథి దీని గురించి బయట పెట్టాలా వద్దా ..? నాలో నేనే చాలాసార్లు బాధపడ్డా అని తెలిపింది. నన్ను ట్యాగ్ చేసేవరకు ఇలాంటి వీడియోలు చేశారని నాకు తెలియదు. చివరకు ఆ వీడియోలను పోలీసులకు చూపించా.. మా నాన్న చనిపోయిన తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ లోగా ఇలా అయ్యింది అని తెలిపింది. మా అమ్మకు దీని గురించి చెప్పను.. మా అన్నకు కూడా చెప్పాను. అని తెలిపింది. అలాగే ఈ విషయంలో విష్ణు ప్రియా తనకు అండగా నిలిచిందని తెలిపింది రీతూ.
రీతూ చౌదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




