Bigg Boss 7 Telugu: ‘ఊహించని ట్విస్ట్ కోసం సిద్ధంగా ఉండండి’.. నాగార్జున వీడియో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రోమో..
గత వారం వీకెండ్ లో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ఇకపై మీరు ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయి రెడీగా ఉండండి అంటూ హింట్ ఇచ్చారు నాగ్. దీంతో మరికొందరు కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారనే టాక్ నడుస్తోంది. అందులో అర్జున్ అంబాటి, అంజలి పవన్, సింగర్ భోలే షావలి, పూజా మూర్తిలతోపాటు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన సింగర్ దామిని, రతిక రోజ్ సైతం రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
బిగ్బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా.. అన్నట్లుగానే సాగుతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడం…. పవరాస్ట్ర కోసం పోటీ పడి చివరకు నలుగురు మాత్రమే హౌస్మేట్స్ గా నిలవడం చూశాం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. గతవారం ఇంటిసభ్యులు అంతా.. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ అంతా కలిసి శివాజీ పవరాస్త్ర వెళ్లిపోయేలా చేశారు. ఇక మిగిలింది ముగ్గురు. ప్రశాంత్, శోభా శెట్టి, సందీప్ దగ్గర మాత్రమే పవరాస్త్రలు ఉన్నాయి. ఇక మొన్నటి ఎపిసోడ్ లో వారి దగ్గరి నుంచి పవరాస్త్రలను తిరిగే తీసేసుకున్నారు. అంతేకాదు.. ఇకపై కెప్టెన్సీ కోసం పోటీపడాలని చెప్పాడు బిగ్బాస్. దీంతో అసలు గేమ్ ప్లాన్ ఏంటీ ?.. పవరాస్ట్రలు ఏంటీ ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అడియన్స్. ఇదిలా ఉంటే.. ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది.
గత వారం వీకెండ్ లో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ఇకపై మీరు ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయి రెడీగా ఉండండి అంటూ హింట్ ఇచ్చారు నాగ్. దీంతో మరికొందరు కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారనే టాక్ నడుస్తోంది. అందులో అర్జున్ అంబాటి, అంజలి పవన్, సింగర్ భోలే షావలి, పూజా మూర్తిలతోపాటు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన సింగర్ దామిని, రతిక రోజ్ సైతం రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక తాజాగా గతవారం నాగార్జున మాట్లాడిన మాటలనే స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ వైల్డ్ కార్డ్ ల గురించి హింట్ ఇచ్చారు మేకర్స్. అందులో “ఈ సీజన్ లో ఇంకా ఎన్నో ఊహించనివి జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్ ఉల్టా పుల్డా “. అంటూ నాగ్ చెప్పిన మాటలను ప్రత్యేకంగా వీడియోగా షేర్ చేశారు. అందులో పలువురు కంటెస్టెంట్స్ ఎంట్రీస్ కనిపిస్తుండగా.. అవి బిగ్బాస్ సీజన్ 7 లాంచ్ వీడియోస్ కావని.. కొత్తగా ఉన్నాయని.. అంటే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.
View this post on Instagram
“సర్ ప్రైజ్ లో రోలర్ కోస్టర్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి. ఈ ఆదివారం బిగ్బాస్ ఇంట్లో విషయాలను నాగార్జున ఉల్టా పుల్టా చేయనున్నారు. మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఊహించని ట్విస్ట్ కోసం రెడీగా ఉండండి” అంటూ తాజాగా స్టార్ మా ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది. తాజాగా విడుదల చేసిన వీడియోలో మొత్తం నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన ప్రోమోలో టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ ఆట మొదలుపెట్టేశాడు. తన కామెడీతో ఇంటి సభ్యులను నవ్వించాలని బిగ్బాస్ ఆదేశించగా.. తన స్టైల్లో అలరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.