Shobha Shetty: ‘మా పెద్దవాళ్లు తాంబులాలు మార్చుకున్నారు’.. వీడియో షేర్ చేసిన బిగ్‏బాస్ శోభా శెట్టి..

ఇటీవలే వీరిద్దరి తాంబులాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 20న శోభా శెట్టి పుట్టినరోజు. ఆరోజు ప్రతి సంవత్సరం తమ ఇంటిలో పూజలు వ్రతాలు నిర్వహిస్తారని.. ఈ ఏడాది వాటితోపాటు పెళ్లి తాంబులాలు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. శోభా, యశ్వంత్ కుటుంబసభ్యుల మధ్య వీరిద్దరి తాంబులాల వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అలాగే అందులోనే బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

Shobha Shetty: 'మా పెద్దవాళ్లు తాంబులాలు మార్చుకున్నారు'.. వీడియో షేర్ చేసిన బిగ్‏బాస్ శోభా శెట్టి..
Shobha Shetty
Follow us

|

Updated on: Jan 25, 2024 | 2:24 PM

బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఇందులో మోనిత పాత్రలో విలనిజం చూపించి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది శోభా శెట్టి. ఇప్పటికీ ఆమె పేరు చెబితే ప్రేక్షకులకు మోనితే గుర్తుకువస్తుంది. అంతగా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ ముగిసిన వెంటనే రియాల్టీ షో బిగ్‏బాస్‏లో అడుగుపెట్టి 14 వారాలు గట్టి పోటీ నిచ్చింది. అయితే ఈ షో ద్వారా పూర్తిగా నెగిటివిటీని సొంతం చేసుకుంది.. కానీ తన ఆట తీరుతో చివరి వరకు నిలిచి. 14వ వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది శోభా. అయితే హౌస్ లో ఉన్నప్పుడు తన ప్రేమ విషయం బయటపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. నాగార్జున ముందే తన ప్రియుడిని అడియన్స్‏కు పరిచయం చేసింది. అతను మరెవరో కాదు.. కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ రెడ్డి. వీరిద్దరి దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక యశ్వంత్ సైతం బయటి నుంచి శోభాకు సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు వీరి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఇటీవలే వీరిద్దరి తాంబులాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 20న శోభా శెట్టి పుట్టినరోజు. ఆరోజు ప్రతి సంవత్సరం తమ ఇంటిలో పూజలు వ్రతాలు నిర్వహిస్తారని.. ఈ ఏడాది వాటితోపాటు పెళ్లి తాంబులాలు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. శోభా, యశ్వంత్ కుటుంబసభ్యుల మధ్య వీరిద్దరి తాంబులాల వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అలాగే అందులోనే బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

తాజాగా తమ పెళ్లి తాంబులాల వీడియోను శోభా షెట్టి తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తూ.. మా పెద్దవాళ్లు తాంబులాలు ఇలా మార్చుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో శోభా మాట్లాడుతూ.. ప్రస్తుతం యశ్వంత్, తను తమ కెరీర్ లో బిజీగా ఉన్నామని.. డేట్స్ అన్ని చూసుకొని త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక ఇది చూసిన నెటిజన్స్ శోభా శెట్టి, యశ్వంత్ కు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.