Bigg Boss 7 Telugu: అశ్విని పుల్లలు పెడుతుంది.. శోభా డార్క్ సైడ్.. హీరో కార్తి ముందే పరువుతీసిన నాగ్..
తాజాగా విడుదలైన ప్రోమోలో తన జపాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా కార్తి బిగ్బాస్ వేదికపైకి వచ్చాడు. ఈ సందర్భంగా కార్తికి ఇంటి సభ్యులను పరిచయం చేశాడు నాగ్. అలాగే అక్కడున్న కంటెస్టెంట్లలో ఎవరు గుడ్.. ఎవరు బ్యాడ్ అనేది కూడా రివీల్ చేశాడు. అలాగే అశ్విని, శోభా పరువు తీశాడు. అందమైన అమ్మాయి అంటూనే కౌంటరిచ్చాడు. నీలా జపాన్ క్యారెక్టర్స్ చాలా మందికి ఉన్నాయ్ ఈ ఇంట్లో అంటూ నాగ్ చెప్పాడు.

బిగ్బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం వీకెండ్ వచ్చేసింది. వారం మొత్తంలో హౌస్మేట్స్ చేసిన తప్పోప్పులపై క్లాస్ తీసుకునేందుకు వచ్చారు నాగ్. తాజాగా శనివారం వీకెండ్ ప్రోమో వచ్చేసింది. అయితే ఎప్పటిలాగా సీరియస్గా కాకుండా.. ఈసారి హీరో కార్తితో కలిసి ఫన్ క్రియేట్ చేశాడు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో తన జపాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా కార్తి బిగ్బాస్ వేదికపైకి వచ్చాడు. ఈ సందర్భంగా కార్తికి ఇంటి సభ్యులను పరిచయం చేశాడు నాగ్. అలాగే అక్కడున్న కంటెస్టెంట్లలో ఎవరు గుడ్.. ఎవరు బ్యాడ్ అనేది కూడా రివీల్ చేశాడు. అలాగే అశ్విని, శోభా పరువు తీశాడు. అందమైన అమ్మాయి అంటూనే కౌంటరిచ్చాడు. నీలా జపాన్ క్యారెక్టర్స్ చాలా మందికి ఉన్నాయ్ ఈ ఇంట్లో అంటూ నాగ్ చెప్పాడు. అంటే డార్క్, డార్కెన్, డార్కెక్టెస్టా అని కార్తి అన్నాడు. సినమాల్లో గుడ్, బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా మొత్తం బ్లాకే అన్నాడు కార్తి.
బిగ్బాస్ ఇంట్లో డార్క్ సైడ్స్ ను పరిచయం చేస్తా అంటూ.. ముందుగా అశ్వినిని నిల్చోబెట్టి.. అందమైన ఆడపిల్ల.. కానీ ఇందరి మధ్య పుల్లలు పెడుతుంది అంటూ సెటైర్ వేశాడు నాగ్. నో సార్ అని అశ్విని అనడంతో తర్వాత మాట్లాడుకుందాంలే అని అన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ గురించి చెబుతూ.. ‘ఇప్పుడైతే మనకు కనిపించేది రామం క్యారెక్టర్. నామినేషన్స్ రోజు మాత్రం అపరిచితుడు బయటకు వస్తాడు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఇక ఆ తర్వాత ప్రియాంక గురించి మాట్లాడుతూ.. ఈ అమ్మాయికి ఎంత చూద్ధామన్నా.. డార్క్ సైడ్ కనిపించడం లేదు అని నాగ్ కితాబివ్వడంతో.. ఈ మాటే చాలు సార్ అంటూ సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక.
View this post on Instagram
ఇక తర్వాత శోభా గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు డార్క్ సైడ్ మాట్లాడుకుందాం.. నేనెందుకులే తేజా నువ్వు చెబుతావా అని అడగ్గా.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ దండం పెట్టేశాడు తేజ. నిజాయతీగా శోభా డార్క్ సైడ్ చెప్పు అని నాగ్ అనడంతో.. మీరు అనుకున్నదే సర్ అనేశాడు తేజ. ఇక తర్వాత అమర్ దీప్ లేచి నిలబడడంతో నేను నిన్ను నిలబడమన్నానా ?.. అని నాగ్ అడగ్గా.. ఇది ర్యాగింగ్ లా ఉందన్నారు కార్తి. అయితే ప్రోమో చూస్తుంటే..ముందుగా కార్తి రావడం.. ఆ తర్వాత అతను వెళ్లిన తర్వాత హౌస్మేట్స్ అందరిని కడిగిపారేయనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.