Bigg Boss 6 – AdiReddy: డబ్బులు తీసుకుంటే వాళ్లకు అన్యాయం చేసినట్లే.. కానీ శ్రీహాన్ 40 లక్షలు తీసుకోవడానికి రీజన్ అదే.. ఆది రెడ్డి కామెంట్స్..

|

Dec 22, 2022 | 8:29 AM

బిగ్ బాస్ సీజన్  6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. ఆ తర్వాత రేవంత్ కంటే శ్రీహాన్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లుగా నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీహాన్ రూ.40 లక్షలు తీసుకోవడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీహాన్ తీరును కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం మద్దతిస్తున్నారు. ఇక రివ్యూయర్, కంటెస్టెంట్ ఆది రెడ్డి తన మనసులోని మాటలను బయటపెట్టారు.

Bigg Boss 6 - AdiReddy: డబ్బులు తీసుకుంటే వాళ్లకు అన్యాయం చేసినట్లే.. కానీ శ్రీహాన్ 40 లక్షలు తీసుకోవడానికి రీజన్ అదే.. ఆది రెడ్డి కామెంట్స్..
Srihan, Adireddy
Follow us on

బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. ఈ సీజన్ విజేతగా సింగర్ రేవంత్ నిలవగా.. రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. ఇక ఆ తదుపరి రన్నరప్ గా కీర్తి కాగా.. నాల్గవ స్థానంలో ఆది రెడ్డి.. ఐదవ స్థానంలో రోహిత్ నిలిచారు. అయితే కోట్ల ఆఫర్స్ తిరస్కరించి ఎలిమినేట్ అయ్యారు ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి. చివరగా. .. విన్నర్, రన్నరప్ గా ఇద్దరు మిగిలగా.. అందులో శ్రీహాన్ రూ. 40 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. దీంతో బిగ్ బాస్ సీజన్  6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. ఆ తర్వాత రేవంత్ కంటే శ్రీహాన్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లుగా నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీహాన్ రూ.40 లక్షలు తీసుకోవడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీహాన్ తీరును కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం మద్దతిస్తున్నారు. ఇక రివ్యూయర్, కంటెస్టెంట్ ఆది రెడ్డి తన మనసులోని మాటలను బయటపెట్టారు.

మీరు కూడా అమౌంట్ తీసుకుని వస్తారని అనుకున్నారు ? అని అడగ్గా… ఆది రెడ్డి స్పందిస్తూ.. తాను ఎప్పుడూ కూడా మాట మీదే ఉంటానని… కోటి రూపాయాలు ఇచ్చినా తీసుకోనని అన్నారు. ముందే అది విన్నర్ ప్రైజ్ అని చెప్పారని.. ఒకవేళ తను రెండో, మూడో స్థానంలో ఉండి.. డబ్బులు ఆఫర్ చేసినప్పుడు తీసుకున్నానంటే అక్కడ విజేతకు అన్యాయం జరిగినట్లే. కానీ వాళ్ల ఫైనాన్సియల్ పొజిషన్ బట్టి కొంతమంది అలా చేయొచ్చు. ఇప్పుడు శ్రీహాన్ చేసింది కరెక్టే. అతను కష్టపడి రెండో స్థానానికి వచ్చాడు. ఫైనాన్సియల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలాసార్లు చెప్పాడు. అలాంటప్పుడు తీసుకోవాలని అనిపిస్తుంది. తీసుకున్నాడు. తప్పులేదు. కానీ ఆ స్థానంలో నేనుంటే తీసుకునేవాడ్ని కాదు. ఇది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.

ఇక బిగ్ బాస్ విజేత ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు కాగా.. విన్నర్ గా నిలిచిన సింగర్ రేవంత్ కేవలం రూ. 10 లక్షలు వచ్చాయి. అలాగే.. బిగ్ బాస్ విన్నింగ్ ట్రోఫితోపాటు.. సువర్ణభూమి వారి నుంచి 650 గజాల ప్లాట్, ఒక బ్రెజా కారుతోపాటు.. అదనంగా కొన్నివారాల రెమ్యూనరేషన్ అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.