Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ హోస్ట్‏గా నందమూరి హీరో ?.. ఇక బొమ్మ బ్లాక్ బస్టరే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Dec 22, 2022 | 10:52 AM

బిగ్ బాస్ షోకు నాగార్జున గుడ్ బై చెప్పేస్తున్నారా ? అవుననే టాక్ వినిపిస్తుంది. తదుపరి సీజన్ కు హోస్ట్ గా చేయనని.. నాగ్ చెప్పేశారని.. దీంతో నందమూరి హీరోను రంగంలోకి దింపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఎవరా హీరో తెలుసుకుందమా.

Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ హోస్ట్‏గా నందమూరి హీరో ?.. ఇక బొమ్మ బ్లాక్ బస్టరే..
Bigg Boss 6 Nagarjuna

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. ముందు నుంచి అట్టర్ ప్లాప్ సీజన్ అని పేరు సంపాందించుకున్న ఈ షో గ్రాండ్ ఫినాలే సైతం ఏమాత్రం పస లేకుండా సాగింది. అనుకున్నట్లుగానే సింగర్ రేవంత్ విన్నర్ కాగా.. శ్రీహాన్ రన్నరప్ గా నిలిచాడు. అయితే రేవంత్ కంటే శ్రీహాన్ కు స్వల్ప మెజారిటీ ఓట్లు వచ్చినట్లు హోస్ట్ నాగార్జున్ గ్రాండ్ ఫినాలే వేదికగా చెప్పగా.. అది ఏమాత్రం నిజం కాదంటున్నారు నెటిజన్స్. సోషల్ మీడియా పోలింగ్స్ ప్రకారం శ్రీహాన్ కంటే రేవంత్ కే ఎక్కువగా ఓట్టుల వచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం.. మొత్తానికి సీజన్ 6 విన్నర్ గా రేవంత్ కాగా.. రూ. 40 లక్షలు సూట్ కేస్ తీసుకొని టైటిల్ రేసు నుంచి ముందే తప్పుకున్నాడు శ్రీహాన్. అయితే కొద్ది రోజులుగా బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ గురించి ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ముఖ్యంగా హోస్ట్ నాగార్జున గురించి.

నెట్టింట వైరలవుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తదుపరి సీజన్ హోస్ట్ గా కింగ్ నాగార్జున ఉండడం లేదట. ఇప్పటికే నిర్వాహకులకు సైతం నాగ్ చెప్పేశారట. దీంతో మరో హీరో కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ షోకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు మరో హీరో పేరు వినిపిస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యవహరించనున్నారట. ఆయనతో సంప్రదింపులు జరిపేందుకు బిగ్ బాస్ నిర్వాకులు సిద్ధమవుతున్నారని టాక్. మరీ చూడాలి బాలయ్య వచ్చే సీజన్ హోస్ట్ గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? లేదా ? అని. మాస్ యాక్షన్ చిత్రాలతో వందలాది మంది అభిమానులను సంపాందించుకున్న బాలయ్య.. అన్ స్టాపబుల్ షోతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు బాలయ్య. సీరియస్ గా కనిపించే నందమూరి హీరో.. అన్ స్టాపబుల్ వేదికపై మాత్రం ఎంతో సరదాగా..అతిథులుగా వచ్చిన వారిరి ఆటపట్టిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఆయన నటిస్తోన్న వీర సింహ రెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu