Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య వార్.. ఉమాను నోరుమూయ్ అంటూ రచ్చ చేసిన ప్రియాంక..

బిగ్ బాస్ హౌస్‌లో వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి. వినాయకచవితిని పుర్కరించుకుని.. బిగ్ బాస్ సభ్యులందరికీ వినాయకపూజ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య వార్.. ఉమాను నోరుమూయ్ అంటూ రచ్చ చేసిన ప్రియాంక..
Uma
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2021 | 4:56 PM

బిగ్ బాస్ హౌస్‌లో వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి. వినాయకచవితిని పుర్కరించుకుని.. బిగ్ బాస్ సభ్యులందరికీ వినాయకపూజ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. దాంతో ఇంటి సభ్యులు పళ్లు, పువ్వులు.. నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు. ఇదిలా ఉంటే ఇక రవి తన కూతుర్ని తలుచుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ తన భార్యను మిస్ అవుతున్నా అంటూ  కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే లోబో కూడా తన ఫ్యామిలీని తలచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక  ప్రియ, రవిల బట్టలు పంపించిన బిగ్ బాస్ ఒక లెటర్ కూడా పంపించాడు. అందులో.. ‘పవర్ రూమ్‌లో ఇంటి సభ్యులు ఉపయోగించబడ్డ శక్తులు ఈ రోజుతో పూర్తి అయ్యాయి.. ప్రియ కెఫ్టెన్‌కి అనార్హురాలు అనేది మాత్రం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశాడు. దాంతో ప్రియా కాస్త నిరాశ పడుతుంది. దాంతో ఇంటిసభ్యులు అంతా ప్రియని ఓదార్చారు.

ఈ క్రమంలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు.? వరస్ట్ పర్ఫామార్ ఎవరు.? అనేది వారి వారి అభిప్రాయాలను చెప్పమంటాడు బిగ్ బాస్. అయితే ప్రియాంక వంతు రాగానే మరో సారి ప్రియాంక తన లైఫ్ స్టోరీని చెప్పుకొచ్చింది. ‘నా చిన్నప్పటి నుంచి నా జీవితం ఓ ముల్లపాన్పే.. అందరితో ప్రేమగా ఉంటున్నాను..ఎందుకు నేను అందరినీ అన్నయ్య అంటున్నాను అంటే.. మా అన్నయ్యవాళ్లు నాకు 13 ఏళ్లు వచ్చేసరికి చాలా పెద్దవాళ్లు అయిపోయారు.. అప్పటికే వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వల్ల.. మా అమ్మనాన్న చెల్లి బాధ్యత నా మీద పడింది. 14 ఏళ్ల వయసులో బాధ్యత తీసుకోవడం వల్ల అన్నయ్య ప్రేమ కూడా పెద్దగా తెలియలేదు.. ఎవరు కనిపించినా నేను అన్నయ్య అని  పిలుస్తాను. లోబో అన్నయ్యా.. మనస్సూర్తిగా కడుపు పట్టుకుని నవ్వేంత నవ్వు అయితే నా జీవితంలో ఎక్కడా దొరకలేదు.. కానీ నాకు మీరు నవ్విస్తుంటే.. ఇంకా నవ్వాలి నవ్వాలి అనిపిస్తోంది అంటూ లోబో పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ఉమాదేవిని వరస్ట్ పర్ఫార్మర్‌‌గా చెబుతుంటే.. ఇద్దరి మధ్య పెద్ద రచ్చే మొదలవుతుంది.  ఈ క్రమంలో ప్రియాంక కంట్రోల్ తప్పి ఉమాను నోరుమూయ్ అనడంతో గొడవ పెద్దదైపోయింది. సారీ కూడా చెబుతుంది కానీ దాన్ని ఉమా దాన్ని తీసుకోదు. ఇక సరయూ ఉమా తరపున మాట్లాడుతూ.. ‘ఉమాగారిని ఎవరో ఒకరు ఎప్పుడూ వెంటకారం చేస్తూనే ఉంటారు.. పాపం ఆవిడ భరిస్తూనే ఉంటారు’ అంటూ ఓదారుస్తుంది. ఇక ప్రియాంక కూడా ఏడుస్తూ.. ‘నోరుముయ్’ అని తప్పు చేశాను అని ఒప్పుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదం.. స్కిడ్ అయిన ఫుటేజీ విడుదల.. వీడియో

Sai Dharam Tej Accident: మెగా హీరోకు యాక్సిడెంట్ అవ్వడానికి ఆ ప్రాంతంలో ఇసుకే కారణమా..? లేటెస్ట్ అప్‌డేట్

Bigg Boss 5 Telugu: నేను కిచన్ మొహమే ఎప్పుడు చూడలేదన్న కాజల్.. శ్రీ రామ్ ఏంచేశాడంటే..