Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బాబోయ్ శ్వేతావర్మ.. ఇంత ఫైర్ ఉందా? ఇచ్చిపారేసింది కదా.. ఈ వారం నామినేషన్స్‌లో వీరే!

మామూలుగానే బిగ్ బాస్ అంటే రచ్చ. ఇక 18 మంది కంటెస్టెంట్స్ లో సగానికి పైగా ఎక్కడా తగ్గేదేలే అనే తీరులో ఉన్నారు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి రోజులో సగం అందరూ వీరలెవల్లో కొట్టుకుంటూనే ఉన్నారు.

Bigg Boss 5 Telugu: బాబోయ్ శ్వేతావర్మ.. ఇంత ఫైర్ ఉందా? ఇచ్చిపారేసింది కదా.. ఈ వారం నామినేషన్స్‌లో వీరే!
Bigg Boss 5 Telugu
Follow us
KVD Varma

|

Updated on: Sep 13, 2021 | 5:45 PM

Bigg Boss 5 Telugu: మామూలుగానే బిగ్ బాస్ అంటే రచ్చ. ఇక 18 మంది కంటెస్టెంట్స్ లో సగానికి పైగా ఎక్కడా తగ్గేదేలే అనే తీరులో ఉన్నారు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి రోజులో సగం అందరూ వీరలెవల్లో కొట్టుకుంటూనే ఉన్నారు. రెండోవారంలో అయినా ఈ వరస మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అబ్బే ఎక్కడా ఎవరూ తగ్గడం లేదు. ఇక సోమవారం రెండో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. దీంతో మరింత రచ్చ మొదలయినట్టు కనిపిస్తోంది. తాజాగా బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రోమోలో నామినేషన్ ప్రాసెస్ మాటల తూటాలతో మోతెక్కినట్టు కనిపిస్తోంది. రెండు టీములుగా విడదీసి.. రంగులు రాసుకొమ్మని చెప్పాడు బిగ్ బాస్. అంటే నచ్చని ఇద్దరి మొహానికి రంగు రాయాలి. కారణం చెప్పాలి. దీంతో రంగుల రచ్చతో రెండోవారం ప్రారంభం అవుతోంది.

తాజాగా విడుదల చేసిన ఈ నామినేషన్ రంగుల రచ్చ ప్రోమోలో శ్వేతా వర్మ నోటికి పనిచేప్పినట్టు కనిపిస్తోంది. తోటి కంటెస్టెంట్స్ లో ఒక్కరినీ కూడా వదలకుండా గట్టిగా ఇచ్చి పారేసినట్టుగా ఉంది. ఇక ప్రోమోలో చూపించిన దానిని బట్టి నామినేషన్స్ లో కార్తీకదీపం ఉమాదేవీ, యానీ మాస్టర్, నటరాజ్, ప్రియాంక సింగ్, ప్రియ, ఆర్జే కాజల్, లోబోలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక శ్వేతావర్మ లోబో..హమీదాలను గట్టిగా వేసుకుంది. ఇద్దరినీ ఒక రేంజిలో దుమ్ముదులిపింది. ఎంత కసి మనసులో ఉందొ.. మరి లోబో ఎంత కాని పని చేశాడో ఏమో కానీ, అతనిచ్చిన ఫ్రెండ్షిప్ బాండ్ ను విసిరి నేలకేసి కొట్టి మరీ.. నీ ఫ్రెండ్షిప్ నాకేమీ అవసరం లేదంటూ నిక్కచ్చిగా చెప్పేసి మరీ రంగేసింది. ఇక హమీదాను అయితే, తీవ్రంగా హెచ్చరించిన శ్వేతావర్మ రంగుతో పూర్తిగా మొహాన్ని రుద్దేసింది. ఇక కాజల్ కు కూడా గట్టిగానే ఇచ్చింది శ్వేతావర్మ. ఆమె విశ్వరూపం చూస్తే ఒక రేంజిలో కనిపిస్తోంది.

ఇక మేమిద్దరం అన్నా తమ్ముళ్ళం అనుకుంటూ తిరిగిన లోబో.. రవిల మధ్య నిప్పు పడింది. లోబో రవిని బీభత్సంగా వేసుకున్నాడు. నువ్వు వద్దూ.. నీ స్నేహమూ వద్దు అంటూ దణ్ణం పెట్టిమరీ రంగు పులిమేశాడు. రవి లోబో మాటలకు షాక్ అయినట్టు కనిపించింది. మరోవైపు కార్తీకదీపం ఉమా ఎదో దారుణమైన మాట వదిలినట్టు వినిపించింది. దీంతో షణ్ముఖ్ షాక్ తిన్నాడు. అసలు హౌస్ లో ఈ నామినేషన్ ప్రక్రియలో అందరూ మంచి ఫైర్ మీద ఉన్నట్టు కనిపిస్తోంది ప్రోమోలో.

విశ్వ కూడా మిగిలిన సభ్యులపై గట్టిగానే మాటల దాడి చేసినట్టు కనిపించింది ప్రోమోలో. ప్రోమో ప్రకారం చూస్తె సోమవం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో వినకూడని మాటలు చాలానే వినే పరిస్థితి వచ్చేలా ఉంది. ఎందుకంటే.. హద్దులు దాటి కంటెస్టెంట్స్ రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది. ఇక నామినేషన్ లిస్టు చూస్తుంటే.. ఈవారం కార్తీకదీపం ఉమా దేవి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెద్దగా లేదు. అదేవిధంగా నటరాజ్ మాస్టర్ కూడా లిస్టులో ఉండడంతో ఆయనకూ బయటకు వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే ఈయనకు కూడా సోషల్ మీడియాలో పెద్దగా పట్టులేదు. లిస్టులో ఉన్నవారిలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక కాజల్ వరుసగా రెండోసారి కూడా నామినేట్ అయింది. ఈ లెక్కన చూస్తె ఆమె అన్నిసార్లూ నామినేషన్స్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. అంత తొందరగా ఆమె బయటకు వెళ్ళదు కానీ, ప్రతిసారి నామినేషన్స్ లో ఉంటుంది. ఇది బిగ్ బాస్ ఏదైనా జరగొచ్చు.. ఎలాగైనా కథ మారిపోవచ్చు.

 

Also Read: Bigg Boss 5 Telugu: మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఎవరు? హౌజ్‌లో దమ్మున్న మగాడు ఎవరు? సరయు సంచలన కామెంట్స్‌.

Bigg Boss 5 Telugu: వామ్మో సరయు విశ్వరూపం.. ఆ ఇద్దర్ని ఓ రేంజ్‏లో ఆడేసుకుందిగా..