Bigg Boss 5 Telugu: వామ్మో సరయు విశ్వరూపం.. ఆ ఇద్దర్ని ఓ రేంజ్‏లో ఆడేసుకుందిగా..

బిగ్‏బాస్ షో రోజు రోజుకీ ప్రేక్షకులలో మరింత ఆదరణ పొందుతుంది. ఇక ఇటీవల ప్రారంభమైన సీజన్ 5 అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది.

Bigg Boss 5 Telugu: వామ్మో సరయు విశ్వరూపం.. ఆ ఇద్దర్ని ఓ రేంజ్‏లో ఆడేసుకుందిగా..
Sarayu Bb
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2021 | 7:43 AM

బిగ్‏బాస్ షో రోజు రోజుకీ ప్రేక్షకులలో మరింత ఆదరణ పొందుతుంది. ఇక ఇటీవల ప్రారంభమైన సీజన్ 5 అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఆదివారం బిగ్ బాస్ ఇంట్లో మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ముందుగా ఆరుగురు సభ్యులు నామినేట్ కాగా.. అందులో సరయు ఎలిమినేట్ అయ్యింది. దీంతో హౌస్‏మేట్స్‏తోపాటు.. నెటిజన్స్ కూడా షాకయ్యారు. అయితే బయటకు వచ్చిన సరయు ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సరయుకు నాగ్ అదిరిపోయే టాక్స్ ఇచ్చాడు. అందులో బెస్ట్ 5 మెంబర్స్, వరెస్ట్ 5 మెంబర్స్ గురించి చెప్పమని ఫిటింగ్ పెట్టాడు. దీంతో సరయు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా కంటెస్టెంట్లను ఓ రెంజ్‏లో ఆడుకుంది. ఒక్కొక్కరికి గురించి చెబుతూ.. తన స్టైల్లో కౌంటర్స్ వేసింది.

ముందుగా బెస్ట్ కంటెస్టెంట్లుగా ఎంచుకున్న విశ్వ, శ్వేత,ప్రియాంక, హమిదా.. మానస్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది సరయు. మానస్ తనకు మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడని.. ప్రియాంకను ఎక్కువగా మిస్ అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక విశ్వ ఇంట్లో అన్ని పనులు చేస్తాడని.. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తాడని చెప్పుకొచ్చింది. హమీద తనకు బెస్ట్ ఫ్రెండ్ అని.. కానీ ఆమెనే ఎక్కువగా నిర్లక్ష్యం చేశానని చెప్పుకొచ్చింది.

ఇక వరెస్ట్ కంటెస్టెంట్స్‏గా సిరి, షన్ను, లహరి, కాజల్, సన్నీలను ఎంచుకుని ఒక్కొక్కరికి ఇచ్చిపడేసింది. ముందుగా సిరి గురించి చెబుతూ.. అందరూ తన వద్దే ఉండాలని కోరుకుంటుంది. షన్ను సిరి వీరిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారని.. ముందే వీరిద్దరు బయట కలిసి మాట్లాడుకుని వచ్చారని తెలిపింది. షన్ను ఎక్కుగా సిరికి సపోర్ట్ చేస్తున్నాడని.. తన గేమ్ తను ఆడడం లేదని చెప్పింది. వీరిద్దరూ చాలా క్లేవర్స్ అని.. కానీ కెమెరాలకు కనబడరని షాకింగ్ కామెంట్స్ చేసింది సరయు.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆ కంటెస్టెంట్

Bigg Boss 5 Telugu: అందుకే అతను నన్ను నామినేట్ చేశాడు.. అప్పటి నుంచే అంత గ్రడ్జ్ పెట్టుకున్నాడు.. శివాలెత్తిన సరయు