Deepika Padukone: డిప్రెషన్‏తో చనిపోదామనుకున్నా.. ఆ బాధ మరెవరికి రాకూడదు.. దీపికా పదుకొనే ఎమోషనల్ కామెంట్స్..

ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‏లలో దీపికా పదుకొనే ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ... తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది

Deepika Padukone: డిప్రెషన్‏తో చనిపోదామనుకున్నా.. ఆ బాధ మరెవరికి రాకూడదు.. దీపికా పదుకొనే ఎమోషనల్ కామెంట్స్..
Deepika
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2021 | 9:22 AM

ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‏లలో దీపికా పదుకొనే ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ… తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. దీపికా నటనకు ప్రేక్షకులకు ఫిదా అవ్వాల్సిందే.. గ్లామర్ పాత్రలైనా.. పౌరాణిక పాత్రలైన దీపికా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అలా బాలీవుడ్ చిత్రపరిశ్రమలో అగ్ర కథనాయికగా కొనసాగుతుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ కౌ్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‏తో కలిసి హాజరయ్యారు. వీరిద్దరు అమితాబ్‏తో తమ వ్యక్తిగత జీవితాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా.. దీపికా.. తను గతంలో డిప్రెషన్‏లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకుంది. లేవగానే విచిత్రంగా ఉండేదని.. ఏ పని చేసినా ఏదో లాగుతున్నట్లుగా ఉండేదని.. నిద్ర అస్సలు రాకపోయేదని.. ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా ఏడ్చేసేదాన్ననీ చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ.. 2014లో నేను డిప్రెషన్‍లో ఉన్నాను. లేవగానే విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ని. ఎవరితోనైనా మాట్లాడాలని గానీ.. బయటకు వెళ్లాలని గానీ అనిపించేది కాదు. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని. చాలా సందర్భాల్లో ఏమి చేయలేకపోతున్నా … ఎందుకు బ్రతకడం అనిపించేది. ఆ సమయంలో చనిపోదామనుకున్నాను. నా మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించిన మా అమ్మ.. వెంటనే సైకియార్టిస్ట్ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చింది. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. తను అనుభవించిన బాధ మరెవరూ అనుభవించొద్దనే ఉద్దేశ్యంతో లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ స్థాపించానని.. చెప్పుకొచ్చింది దీపికా. ఈ ఫౌండేషన్ ద్వారా చాలా మంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారని.. అందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇక ఇలా డిప్రెషన్‏లో ఉన్న సమయంలోనే ఆమె హ్యపీ న్యూయర్ సినిమాలో నటించిందని.. కానీ తన బాధను ఒక్కక్షణం కూడా చూపించలేదని చెప్పారు ఫరా ఖాన్.

Also Read: Sai Dharam Tej Accident: నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం.. అపోలోలో కొనసాగుతున్న చికిత్స

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. సెలబ్రెటీలకు బిగుస్తున్న ఉచ్చు.. ఈరోజు నవదీప్‏పై అధికారుల ప్రశ్నల వర్షం..