Sai Dharam Tej Accident: నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం.. అపోలోలో కొనసాగుతున్న చికిత్స

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే మెగా అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ అభిమాన హీరోకు ఏమైందో అని అభిమానులంతా..

Sai Dharam Tej Accident: నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం.. అపోలోలో కొనసాగుతున్న చికిత్స
Tej

Sai Dharam Tej Accident: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే మెగా అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ అభిమాన హీరోకు ఏమైందో అని అభిమానులంతా ఆందోళకు గురయ్యారు. ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు… దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‏ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో చికిత్స అందుస్తునన్న సమయంలో సాయి ధరమ్ తేజ్.. చికిత్స్ స్పందించాడని వైద్యులు తెలిపారు.

ఇప్పటికే తేజ్ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో ఆసుపత్రి వైద్యులు. అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్‌కు  చికిత్స కొనసాగుతుంది. నిన్న(12న ) మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ విడుదల చేశారుఅపోలో వైద్యులు. తేజ్‌కు షోల్డర్ బొన్ విరగడంతో  ఆయనకు సర్జరీ చేశారు వైద్యులు బృందం. సర్జరీ తరువాత అబ్జర్వేషన్‌లో తేజ్ ఉంచారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని .. ఆయన చికిత్సకు సహకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , నిహారిక, మెగాస్టార్ సతీమణి సురేఖ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆసుపత్రికి వెళ్లి తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు తేజ్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej-Naresh: సాయి ధరమ్ ప్రమాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై నరేష్ వివరణ.. తన బిడ్డలాంటివాడు.. బాగుండాలని కోరుకుంటున్నా…

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. సెలబ్రెటీలకు బిగుస్తున్న ఉచ్చు.. ఈరోజు నవదీప్‏పై అధికారుల ప్రశ్నల వర్షం..

Bheemla Nayak: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పవర్ స్టార్ మానియా.. రికార్డులు తిరగరాస్తున్న భీమ్లానాయక్

 

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu