రెచ్చిపోయిన సూపర్ స్టార్ అభిమానులు.. హీరో పోస్టర్ ముందు మూగజీవిని బలిచ్చి ఆపై..

స్టార్ హీరోల క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అభిమానం ఒకొక్కసారి హద్దులు దాటి పిచ్చిగా కూడా మారుతుంది.

రెచ్చిపోయిన సూపర్ స్టార్ అభిమానులు.. హీరో పోస్టర్ ముందు మూగజీవిని బలిచ్చి ఆపై..
Supar Star

స్టార్ హీరోల క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అభిమానం ఒకొక్కసారి హద్దులు దాటి పిచ్చిగా కూడా మారుతుంది. ఇప్పటికే కొంతమంది తమ అభిమాన తారలను కలవడానికి ఇల్లూవాకిలి వదిలిపెట్టి నడుచుకుంటూ ఊర్లు.. రాష్ట్రాలు కూడా దాటి వెళ్తున్నారు. మరి కొంతమంది తమ హీరో, హీరోయిన్లను చూడటానికి వాళ్ళ ఇంటిముందు పడిగాపులు కాస్తుంటారు. ఇదిలా ఉంటే మరి కొంతమంది తమ అభిమాన హీరో సినిమా పోస్టర్లకు పూలాభిషేకాలు.. పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు వీరిలో కొందరు రెచ్చిపోయి రక్తంతో పోస్టర్‌లో ఉన్న తమ హీరోకు బొట్టు పెట్టడంలాంటివి కూడా జరుగుతుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ ఏకంగా పోస్టర్‌కు రక్తాభిషేకం చేశారు. ఓ ముగ జీవిని బలిచ్చి మరీ పోస్టర్‌కు రక్తాభిషేకం చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్స్‌గా నటిస్తుంటే సీనియర్ తారలు మీనా , ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించేనున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమానుంచి పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తమిళనాడులో కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. పోస్టర్‌ను భారీగా ఏర్పాటు చేసి దాని ముందు మేకను బలిచ్చారు. మేకను పోస్టర్ ముందు ఉంది దాని తలను నరికేశారు. అనంతరం ఆ రక్తంతో పోస్టర్‌కు రక్తాభిషేకం చేశారు. ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని పై కొందరు జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. సెలబ్రెటీలకు బిగుస్తున్న ఉచ్చు.. ఈరోజు నవదీప్‏పై అధికారుల ప్రశ్నల వర్షం..

Bigg Boss 5 Telugu: వామ్మో సరయు విశ్వరూపం.. ఆ ఇద్దర్ని ఓ రేంజ్‏లో ఆడేసుకుందిగా..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆ కంటెస్టెంట్

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu