AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. సెలబ్రెటీలకు బిగుస్తున్న ఉచ్చు.. ఈరోజు నవదీప్‏పై అధికారుల ప్రశ్నల వర్షం..

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఈడీ

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. సెలబ్రెటీలకు బిగుస్తున్న ఉచ్చు.. ఈరోజు నవదీప్‏పై అధికారుల ప్రశ్నల వర్షం..
Navdeep
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2021 | 9:49 AM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటిసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్, నందు, రానా దగ్గుబాటిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. వారికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, మనీ లాండరింగ్ పై సెలబ్రెటీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఈరోజు సోమవారం ఈ కేసులో భాగంగా నటుడు నవదీప్‏ను ఈడీ ప్రశ్నించనుంది. ఇక ఇదే రోజు విచారణకు హాజరుకావాలని ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్‏కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ముందుగా ఈ కేసు మొత్తంగా ప్రధాన నిందితుడు కెల్విన్ చుట్టూ తిరిగిన.. ఆ తర్వాతి విచారణలో ఎఫ్ క్లబ్ పార్టీలపైనా.. పార్టీల్లో పాల్గొన్న సెలబ్రెటీలకు బిగుసుకుంది. వారికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, మనీ లాండరింగ్ పై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈరోజు విచారణకు వచ్చే నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ పై ఈడీ అధికారులు కాస్త ఎక్కువగానే ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈడీ అధికారులు పలువురు సెలబ్రెటీల నుంచి వారి వారి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించగా.. ఈ కేసులో అప్రూవల్‏గా మారిన కెల్విన్, అతడి స్నేహితుడు, ఈవెంట్ మేనేజర్ జీషాన్ అలీల బ్యాంక్ ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బులు మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీశారు. ఇక ఈరోజు నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్.. కెల్విన్‏తో జరిగిన లావాదేవీలు… మనీ ట్రాన్స్‏ఫర్ విషయాలపై ఆరా తీయనున్నారు. నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ చెప్పే అంశాల ఆధారంగా ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయో లేదో చూడాలి. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ దూకుడు పెంచింది. ఇప్పటికే విచారణకు వచ్చిన సెలబ్రెటీలను దాదాపు ఐదు గంటలకు పైగా ప్రశ్నిస్తుంది. దీంతో ఈ కేసుపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

Also Read: Bigg Boss 5 Telugu: వామ్మో సరయు విశ్వరూపం.. ఆ ఇద్దర్ని ఓ రేంజ్‏లో ఆడేసుకుందిగా..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆ కంటెస్టెంట్

Follow Us
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, గ్రీజును వదిలించే మ్యాజిక్ ట్రిక్..
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, గ్రీజును వదిలించే మ్యాజిక్ ట్రిక్..
ఇదేక్కడి సంప్రదాయం..? శవయాత్రలో డీజే డ్యాన్స్! వికృత చేష్టాలంటూ
ఇదేక్కడి సంప్రదాయం..? శవయాత్రలో డీజే డ్యాన్స్! వికృత చేష్టాలంటూ
తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం..
తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం..
బ్రిడ్జికి వేలాడుతున్న తల, కిందపడ్డ మొండెం! వృద్ధుడి ఆత్మహత్యతో
బ్రిడ్జికి వేలాడుతున్న తల, కిందపడ్డ మొండెం! వృద్ధుడి ఆత్మహత్యతో
బైకర్ ట్రైలర్.. బైక్ రేసర్‏గా శర్వానంద్..
బైకర్ ట్రైలర్.. బైక్ రేసర్‏గా శర్వానంద్..
బట్టతలకు అసలు కారణం ఏంటో తెలుసా..? అధ్యయనంలో విస్తుపోయే నిజాలు.
బట్టతలకు అసలు కారణం ఏంటో తెలుసా..? అధ్యయనంలో విస్తుపోయే నిజాలు.
బాలకృష్ణతో పేకాట ఆడుతుండగా ఇలా జరిగింది.. ఆ తర్వాత
బాలకృష్ణతో పేకాట ఆడుతుండగా ఇలా జరిగింది.. ఆ తర్వాత
మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి!
మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి!
చాణక్య నీతి సూచించిన విజయవంతమైన దాంపత్య రహస్యాలు!
చాణక్య నీతి సూచించిన విజయవంతమైన దాంపత్య రహస్యాలు!
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే