Bheemla Nayak: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పవర్ స్టార్ మానియా.. రికార్డులు తిరగరాస్తున్న భీమ్లానాయక్

పవర్ స్టార్ పవన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ చురునుగ్గా పాల్గొంటున్నారు.

Bheemla Nayak: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పవర్ స్టార్ మానియా.. రికార్డులు తిరగరాస్తున్న భీమ్లానాయక్
Pawan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2021 | 8:04 AM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ చురునుగ్గా పాల్గొంటున్నారు. ఇక ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాలతో ఫ్యాన్స్‌కు సాలిడ్ ట్రీట్ ఇచ్చిన పవర్ స్టార్ ఇప్పుడు భీమ్లా నాయక్‌గా రాబోతున్నాడు. మలయాళం మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. తమన్ సంగీత సారథ్యంలో సాగిన ఈ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే మిలియన్ వ్యూస్ దక్కించుకోగా.. ఇక ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ పాట 26 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా తాజాగా 1 మిలియన్ లైక్స్‌ను కూడా సొంతం చేసుకుంది.

పాటతోపాటుగా విజువల్స్ కూడా అద్బుతంగా ఉండటంతో యూట్యూబ్‌లో అభిమానులు పదే పదే భీమ్లా నాయక్ పాటను చూస్తున్నారు. విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది ఈ పాట. ఇక తాజాగా భీమ్లా నాయక్‌ ఫస్ట్ గ్లింప్స్ కూడా మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకుంది. ఇలా విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్ ను సృష్టిస్తుంది భీమ్లానాయక్. ఫస్ట్ గ్లింప్స్ ఆల్ ఇండియా రికార్డు దక్కించుకుంది అంటూ అఫిషియల్‌గా భీమ్లా నాయక్ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా డీ గ్లామర్ లుక్‌లో నిత్యా కనిపించనుందని తెలుస్తుంది. భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న నేపథ్యంలో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆ కంటెస్టెంట్

Bullet Bandi Song: కమింగ్ సూన్… వెండితెరపై డుగుడుగు పాట.. ఎలాగంటే…?

Kangana Ranaut: తలైవి జయలలిత బాటలో రాజకీయాల్లోకి వస్తారా?.. కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..