
తెలుగు సినీప్రియులకు హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీరియల్ నటిగా అలరించింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా నటిగా స్మాల్ స్క్రీన్ పై తెరంగేట్రం చేసిన హిమజ.. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసింది. అదే పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగుపెట్టింది. కానీ తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చింది. బిగ్ బాస్ తర్వాత సీరియల్స్ కు దూరంగా ఉంటున్న హిమజ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. కానీ సినిమాల్లో మాత్రం చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంది. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. తాజాగా తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది చేసింది హిమజ.
ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‌తో క్రేజ్.. క్యాన్సర్‌తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..
హిమజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకుందని తెలుస్తోంది. ఆమె తండ్రి మరణించినట్లు వీడియో షేర్ చేస్తూ వెల్లడించింది హిమజ. “ఆ స్వర్గం లివింగ్ సోల్ ను తీసుకెళ్లిపోయింది.. మిమ్మల్ని మిస్ అవుతున్నాను నాన్న “ అంటూ తన తండ్రితో కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు హిమజ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ హిమజకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..
ఇదెలా ఉంటే.. కెరీర్ పరంగా ప్రస్తుతం హిమజ సీరియల్స్ కు దూరంగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో అలరిస్తుంది. అలాగే ఆమె సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ నెటిజన్లకు దగ్గరగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..