AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో పాపులర్ యాక్టర్ మృతి.. షాక్‏లో చిత్రపరిశ్రమ…

Amit Mistry: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే తమిళ యాక్టర్ వివేక్ గుండెపోటుతో మరణించగా.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో పాపులర్ యాక్టర్ మృతి..  షాక్‏లో చిత్రపరిశ్రమ...
Amit Mistry
Rajitha Chanti
|

Updated on: Apr 23, 2021 | 2:14 PM

Share

Amit Mistry: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే తమిళ యాక్టర్ వివేక్ గుండెపోటుతో మరణించగా.. గురువారం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వరుస విషాదాల నుంచి తేరుకోకముందే చిత్రపరిశ్రమ మరో పాపులర్ నటుడిని కోల్పోయింది. ప్రముఖ గుజరాతీ నటుడు అమిత్ మిస్త్రీ తీవ్ర్ గుండెపోటుతో శుక్రవారం కన్నుమూసారు. ఈ విషయాన్ని ఫిల్మ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్వీట్ చేసింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అమిత్ కు నివాళి అర్పించింది చిత్ర పరిశ్రమ. మిస్త్రీ మరణంపై విచారం వ్యక్తం చేసిన నటి కుబ్రా సైత్ అమిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇంకా పలువురు మిత్రులు, పరిశ్రమ పెద్దలు మిస్త్రీ అకాలమరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమిత్.. చివరి సారిగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ బ్యాండిష్ బండిట్స్ లో కనిపించాడు. అంతకు ముందు పలు టీవీ షోస్, సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్యా కెహ్నా, ఏక్ చాలిస్ కి లాస్ట్ లోకల్, 99, షోర్ ఇన్ ది సిటీ, యమలా పాగ్లా దీవానా లాంటి సినిమాల్లో నటించారు. కేవలం నటుడిగానే కాకుండా.. డైలాగ్ రైటర్ గా , డైరెక్టర్ గా బుల్లితెరతోపాటుూ.. బాలీవుడ్, గుజరాతీ చిత్రాలకు కూడా పనిచేశారు. అలాగే చారిత్రక తెనాలి రామ సీరియల్లో బీర్బల్ పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమిత్. ఈయన మృతితో సినీ పరిశ్రమలో మరోసారి విషాదచాయలు అలుముకున్నాయి.

ట్వీట్..

Also Read: Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు…

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారి కోసం కొత్త సిలిండర్లు..