AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Pradeep: వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కామెంట్స్.. ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం..

Anchor Pradeep:  బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ సుపరిచితమే.. అదిరిపోయే టాకింగ్ పవర్‏తోపాటు.. కామెడీ టైమింగ్స్‏తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Anchor Pradeep: వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కామెంట్స్.. ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం..
Pradeep
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2021 | 11:57 AM

Share

Anchor Pradeep:  బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ సుపరిచితమే.. అదిరిపోయే టాకింగ్ పవర్‏తోపాటు.. కామెడీ టైమింగ్స్‏తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఎంతో పాపులారిటీ ఉన్న ప్రదీప్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు ప్రదీప్. ఓ షోలో ఏపీ రాజధానిపై యాంకర్ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ప్రదీప్ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సాధారణంగా.. సెలబ్రెటీలు వేదికలపై అనుకోకుండా మాట్లాడే మాటలు వాళ్లను చిక్కుల్లో పడేస్తాయి. అలాగే ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇటీవల జబర్థస్త్ కమెడియన్ హైపర్ ఆది సైతం ఓ షోలో తెలంగాణ భాషపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారి తీసాయి. దీంతో ఆది క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ప్రదీప్ కూడా అలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రదీప్‌ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్‌ ప్రదీప్‌ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే.. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికలపూడి శ్రీనివాసరావు. ప్రదీప్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని.. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పకపోతే.. ప్రదీప్ ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

గతంలో కూడా ప్రదీప్ డ్రంకన్ డ్రైవ్‏లో పట్టుబడ్డాడు. ఆ తర్వాత కూడా ప్రదీప్ చాలా వివాదాల్లోనే ఇరుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని గురించి ప్రదీప్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. రాజధాని విశాఖ అంటే తప్పేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కొందరు యాంకర్ ప్రదీప్ కు అండగా ఉంటామన్నారు.

Also Read: East Godavari : పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి, మహిళా కార్యదర్శిని దిక్కున్నచోట చెప్పుకోమన్న సర్పంచ్ భర్త

International Yoga Day 2021: కరోనా సంక్షోభం మధ్య… యావత్ ఇండియా ఇంటర్నెషనల్ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది…