AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amardeep-Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై అమర్‏దీప్ ఫస్ట్ రియాక్షన్.. బిగ్‏బాస్ తర్వాత లైఫ్‏లో జరిగింది అదే..

బిగ్‏బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వేరే మైండ్ సెట్ లో ఉంటాం. బయటకు వచ్చిన తర్వాత మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రతి మనిషి జీవితంలోనూ ఊహించనిది ఏదో జరుగుతుంది. నాకు అలాగే జరిగిందని అనుకున్నాను. నేను విన్నర్ కాలేకపోయానని బాధ లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నర్ అయ్యాను. రవితేజ గారు నాకు సినిమా ఇచ్చినప్పుడే నేను విన్నర్. అది చాలు నాకు. నేను అందుకోసమే వచ్చాను.

Amardeep-Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై అమర్‏దీప్ ఫస్ట్ రియాక్షన్.. బిగ్‏బాస్ తర్వాత లైఫ్‏లో జరిగింది అదే..
Amardeep, Prashanth
Rajitha Chanti
|

Updated on: Jan 06, 2024 | 8:47 AM

Share

బుల్లితెరపై ఈసారి బిగ్‏బాస్ సీజన్ 7కు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. కమన్ మ్యాన్ కేటగిరిలో హౌస్‏లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచి విజేత కాగా.. సీరియల్ నటుడు అమర్ దీప్ రన్నర్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది. గ్రాండ్ ఫినాలే చివరి వరకు వీరిద్దరిలో ఎవరు విన్నర్ అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నడిచింది. ఇద్దరికీ పోటా పోటీగా ఓటింగ్ రాగా.. స్వల్ప తేడాతో టైటిల్ విన్నర్ అయ్యాడు ప్రశాంత్. హౌస్‏లో ఉన్న సమయంలో అమర్ దీప్, ప్రశాంత్ మధ్య జరిగిన గొడవలు.. మాటల యుద్ధం గురించి తెలిసిందే. మొదటి వారమే ఇద్దరిలో నువ్వా నేనా అన్న రేంజ్‏లో మాటల యుద్ధం నడిచింది. దీంతో బయట ప్రశాంత్ కు పాజిటివ్.. అమర్ కు నెగిటివ్ ఏర్పడింది. కానీ ఆ తర్వాత వారాల్లో ఇద్దరూ అన్నదమ్ముల్లా కలిసిపోయారు. అయితే చివరి వారాల్లో మరోసారి ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో మరోసారి సోషల్ మీడియాలో అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకరి గురించి మరొకరు నెగిటివ్ కామెంట్స్ చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే.. బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో బయట అమర్ దీప్ కారు పై ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొన్ని అల్లరిమూకలు దాడి చేశాయి.

ఆ సమయంలో కారులో అమర్ దీప్ తోపాటు తన కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ కార్లను ధ్వంసం చేశారు. పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా ర్యాలీ చేయడంతో బిగ్‏బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు ప్రశాంత్. ఆ సమయంలో శివాజీ, భోలే షావలి, శుభ శ్రీ, అశ్విని, రతిక, యావర్ ప్రశాంత్ కు మద్దతుగా నిలిచారు. తాజాగా ప్రశాంత్ అరెస్ట్ పై మొదటిసారి స్పందించాడు అమర్ దీప్.

అమర్ దీప్ మాట్లాడుతూ..”బిగ్‏బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వేరే మైండ్ సెట్ లో ఉంటాం. బయటకు వచ్చిన తర్వాత మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రతి మనిషి జీవితంలోనూ ఊహించనిది ఏదో జరుగుతుంది. నాకు అలాగే జరిగిందని అనుకున్నాను. నేను విన్నర్ కాలేకపోయానని బాధ లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నర్ అయ్యాను. రవితేజ గారు నాకు సినిమా ఇచ్చినప్పుడే నేను విన్నర్. అది చాలు నాకు. నేను అందుకోసమే వచ్చాను. నా అభిమానులు నన్ను అక్కడి వరకు తీసుకువచ్చారు. ఒకప్పుడు అమర్ చిన్న నటుడు. ఇప్పుడు పెద్ద సెలబ్రెటీని చేశారు. నేను కావాలనుకున్న స్టార్ డమ్ వచ్చేసింది. ” అని అన్నారు.

“ప్రశాంత్ అరెస్ట్ అయ్యడంటే.. కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల అలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడన్నా క్లియర్ అయిపోయాయి. అంతా కూల్. బయట ఫ్యాన్స్ గొడవలు సహజం. మేం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు కూడా మా హీరో అంటే హీరో అని కొట్టుకునేవాళ్లం. ఫ్యాన్స్ గొడవపడుతుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే.. మేం బాగానే ఉన్నాం. గొడవలు పెట్టుకోవద్దు. మీరు బాగా ఉండండి. మేం బాగా ఉంటాం. త్వరలో రవితేజ సినిమా అప్డేట్ తో మీ ముందు ఉంటాను. బిగ్‏బాస్ తో నా లైఫ్ చాలా మారిపోయింది అనుకోను. కానీ మైండ్ మెచ్యురిటీ వచ్చింది. హౌస్ లో నేను వీక్ అన్నారు. కానీ నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us