Tollywood: లేడీ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చిన ‘జానకి కలగనలేదు’ హీరో.. ఆ నటితో సడెన్ ఎంగేజ్‌మెంట్
తెలుగు టెలివిజన్ యాక్టర్ అమర్‌దీప్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతను ఓ సీరియల్ నటితో ఏడడుగులు వేయబోతున్నాడు. తాజాగా నిశ్చితార్థం కూడా జరిగింది.
Janakai kalaganaledu hero marriage: జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగు నాట మంచి పేరు తెచ్చుకున్న అమర్‌దీప్ తన ఫీమేల్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. కేరాఫ్ అనసూయ ధారావాహిక నటి తేజస్విని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. రీసెంట్‌గా వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. చాలా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు నటి, యాంకర్ అరియానా(ariyanaglory) హాజరైంది. ఈ కాబోయే జంటకు విషెస్ తెలుపుతూ వారితో కలిసి దిగిన ఫోటోను స్మాల్ వీడియోగా చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అమర్‌దీప్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ‘ఇంత సడెన్ షాక్ ఇచ్చావ్.. మా మనసులను గాయపరిచావ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్న ఈ కపుల్‌కు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. కాగా వీరిది లవ్ మ్యారేజ్ అని తెలుస్తోంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. సీరియల్ నటీనటులు పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. గతంలో కూడా ధారావాహికల్లో నటించే పలువురు.. అదే ఫీల్డ్‌కి చెందిన వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు.
View this post on Instagram