మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్‌పై బన్నీ గురి..!

వరస ప్లాపులతో సతమతమైన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మహేశ్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’‌తో పోటీ పడ్డ బన్నీ, ఆ మూవీ కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించాడు. ఇదే జోష్‌లో మరో భారీ హిట్ కన్నేశాడు ఈ మెగా హీరో. వాస్తవానికి ఈ సమ్మర్‌లో రిలీజ్ అనుకున్న ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాదికి సంక్రాంతికి డేట్ మార్చుకుంది. దీంతో రాబోయే చాలా చిత్రాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది.  ఈ ఏడాది సమ్మర్‌లో […]

మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్‌పై బన్నీ గురి..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 06, 2020 | 7:20 PM

వరస ప్లాపులతో సతమతమైన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మహేశ్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’‌తో పోటీ పడ్డ బన్నీ, ఆ మూవీ కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించాడు. ఇదే జోష్‌లో మరో భారీ హిట్ కన్నేశాడు ఈ మెగా హీరో. వాస్తవానికి ఈ సమ్మర్‌లో రిలీజ్ అనుకున్న ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాదికి సంక్రాంతికి డేట్ మార్చుకుంది. దీంతో రాబోయే చాలా చిత్రాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది.  ఈ ఏడాది సమ్మర్‌లో పవన్ వకీల్ సాబ్‌తో సందడి చేయబోతున్నారు. ఆయన మూవీ తప్పితే మరో భారీ చిత్రం ఏదీ రేస్‌లో లేదు. ఈ గ్యాప్‌ని యూజ్ చేసుకోవాలని బన్నీ భావిస్తున్నాడట.

సుకుమార్‌తో చేస్తోన్న తన తదుపరి మూవీని ఈ దసరాకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. పెద్ద హీరో సినిమా ఏం లేనప్పుడు, సినీ జనాలు ఆకలితో ఉన్నప్పుడు మంచి మాస్ ఎంటర్టైనర్‌తో వచ్చి మరోసారి ఇండస్ట్రీ రికార్డుల దుమ్ము దులపడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే సుకుమార్ పర్‌ఫెక్షన్‌ను ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. మూవీని అద్దంలా తీర్చిదిద్దుతారు. మరి బన్నీ ప్లాన్‌ను సుకుమార్ అర్థం చేసుకుంటాడో, లేదో చూడాలి.