AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rangasthalam Movie Tamil Teaser : శ్రీరామనవమి పర్వదినాన రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీ తమిళ్ వెర్షన్ టీజర్ రిలీజ్

Tamil version of Ram Charan's Rangasthalam Movie Trailer : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, సమంత జంటగా నటించిన మూవీ 'రంగస్థలం'...

Rangasthalam Movie Tamil Teaser : శ్రీరామనవమి పర్వదినాన రామ్ చరణ్ 'రంగస్థలం' మూవీ తమిళ్ వెర్షన్ టీజర్ రిలీజ్
Rangasthalam Tamil Version
Venkata Narayana
|

Updated on: Apr 21, 2021 | 7:26 PM

Share

Tamil version of Ram Charan’s Rangasthalam Movie Trailer : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, సమంత జంటగా నటించిన మూవీ ‘రంగస్థలం’. ఈ సినిమా తెలుగు చలనచిత్ర సీమలో ఎంతటి ఘన విజయన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2018 మార్చి 30న విడుదలై సూపర్ హిట్ అయింది. ఇకిప్పుడు తమిళ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. తమిళనాడులో 300లకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోలీవుడ్‌లోనూ ‘రంగస్థలం’ పేరుతోనే ఈ సినిమా విడుదల కానుంది. ఒక నదీ తీర ప్రాంత గ్రామ కథా నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్.. చిట్టిబాబు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్‌ బాబుగా ఆది పినిశెట్టి ఆకట్టుకున్నారు.

రంగస్థలం సినిమా తమిళ డబ్బింగ్‌ వెర్షన్‌ని ఏప్రిల్‌ 30న విడుదల చేస్తుండగా, శ్రీరామనవమి పర్వదిన వేళ ఈ సినిమా తమిళ వెర్షన్ ట్రైలర్ ను ఇవాళ సాయంత్రం 5.30 కి రిలీజ్ చేశారు.  ఇదే ఆ టీజర్..

Read also : Oxygen Leaks : హాస్పిటల్‌లో ఘోర ప్రమాదం.. భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్..22 మంది రోగుల మృతి