AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: అచ్చం దృశ్యం సినిమానే.. ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.. ఓటీటీలోకి మరో సస్పెన్స్ థ్రిల్లర్..

ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. నిత్యం ఏదోక మూవీ అడియన్స్ ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీ లవర్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. మరీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Cinema: అచ్చం దృశ్యం సినిమానే.. ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.. ఓటీటీలోకి మరో సస్పెన్స్ థ్రిల్లర్..
Parimala And Co
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2026 | 11:17 AM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సినీ ప్రియులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రాలు సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నటులు జయరామ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మర్డర్ మిస్టరీ, డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘పరిమళా అండ్ కో’ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ క్రైమ్-కామెడీ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 5, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, దాదాపు నెల రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జులై 10, 2026 నుండి ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

‘పరిమళా అండ్ కో’ కథ విషయానికి వస్తే.. ఇది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం చుట్టూ తిరిగే కథ. ఆ కుటుంబంలోని చిన్న అమ్మాయిని వేధిస్తున్న ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్ (రౌడీ) అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ఈ మర్డర్ మిస్టరీలో ఆ కుటుంబమే ప్రధాన నిందితులుగా మారుతుంది. ఆ గ్యాంగ్‌స్టర్‌ను చంపింది ఎవరు? ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరిపై ఒకరికి వచ్చే అనుమానాలు, దాని చుట్టూ జరిగే డార్క్ కామెడీ , ట్విస్టులతో దర్శకుడు పాండిరాజ్ ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచారు. ఆద్యంతం ఈ సినిమాలోని సస్పెన్స్, ట్విస్టులు ప్రేక్షకులను చివరి వరకు సీట్లో కూర్చొనేలా చేస్తాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత జయరామ్, ఊర్వశి కలిసి పూర్తిస్థాయి పాత్రల్లో నటించిన చిత్రం కావడం విశేషం. వీరితో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మిస్సిన్, యోగి బాబు, శాండీ మాస్టర్, సంజన కృష్ణమూర్తి, అనంతిక సనిల్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో మిస్ అయిన వారు, అలాగే సస్పెన్స్ అండ్ కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి జులై 10 నుండి జీ5 లో ‘పరిమళా అండ్ కో’ ఒక మంచి ఛాయిస్ కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

పరిమళ అండ్ కో సినిమా..

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

Follow Us