AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత దైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావ్..! అరుణాచలం కొండపై నటి.. జరిమానా విధించిన అధికారులు

అరుణాచలం పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతి భక్తుడు ఒక్కసారైన అరుణాచలం వెళ్లాలని, అలాగే అరుణ గిరి చుట్టూ ప్రదక్షణ చేయాలని అనుకుంటారు. లక్షలాది మంది భక్తులు అరుణాచలం వెళ్లాలని, గిరి ప్రదక్షణ చేయాలని అనుకుంటారు. పూర్ణమి రోజు జనాలు ఎక్కువ మంది అరుణాచలం వెళ్తారు.

ఎంత దైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావ్..! అరుణాచలం కొండపై నటి.. జరిమానా విధించిన అధికారులు
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2026 | 10:47 AM

Share

అరుణాచలం.. పరమశివుడు కొలువైన దివ్య క్షేతం.. ప్రతి శివ భక్తుడు ఒక్కసారైనా వెళ్లాలనుకునే క్షేత్రం అరుణాచలం. అరుణగిరి ప్రదక్షణ చేయాలంటే శివుడి అనుమతి ఉండాలని చెప్తుంటారు. ఎంతో మంది అరుణాచలం వెళ్లాలని, అరుణాచలేశ్వరస్వామిని దర్శించుకోవాలని, జీవితంలో ఒక్కసారైనా గిరిప్రదక్ష చేయాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. అయితే ఎంతో పవిత్రంగా భావించే అరుణగిరి చుట్టూ లక్షలాది మంది ప్రదక్షణ చేస్తుంటారు. గిరి చుట్టూ 14 కిలోమీటర్లు ప్రదక్షణ చేస్తుంటారు. ఆలయం వెనకాల  2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరి ఉన్న విషయం తెలిసిందే. అయితే అరుణ చలం కొండా చుట్టూ ప్రదక్షణ చెయ్యొచ్చు కానీ గిరి పైకి మాత్రం ఎక్కడం నిషేధం.. అటవీశాఖ అధికారులు గిరిపైకి ఎక్కనివ్వరు. కానీ ఓ హీరోయిన్ అరుణాచలం కొండపైకి ఎక్కింది. దాంతో అటవీశాఖ అధికారులు జరిమానా విధించారు.

నటి అర్చనా రవిచంద్రన్‌ తమిళ్ ఇండస్ట్రీలో టీవీ నటి. అలాగే పలు సినిమాల్లోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఈ నాటికి మంచి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నటి అర్చనా రవిచంద్రన్‌ రీసెంట్ గా అరుణాచలం వెళ్ళింది. ఆమెతో పటు నటుడు అరుణ్ కూడా వెళ్ళాడు. అయితే ఈ ఇద్దరూ అన్నామలై గిరిపైకి ఎక్కారు. అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటవీశాఖ అదిరికారుల నిబంధనలను ఉల్లంఘించడం పై పలువురు భక్తులు కూడా సీరియస్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

అరుణాచలం కొండపైకి ఎక్కి ఫోటోలు దిగడం. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పై అటవీశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. దాంతో అర్చనా రవిచంద్రన్‌, అరుణ్ ఇద్దరికి రూ. 5వేలు చొప్పున జరిమానా విధించా అటవీశాఖ అధికారులు. అలాగే ఇలాంటి పనులు చెయ్యొద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ కొండను శివభక్తుల పరమశివుడి రూపంగా భావిస్తారు. ఆగిరి చుట్టూ ప్రదక్షణ చేయాలి కానీ గిరి పైకి ఎక్కడం నిషేధించారు. ఇప్పుడు అర్చనా రవిచంద్రన్ కొండ ఎక్కడంతో ఆమె పై విమర్శలు చేస్తున్నారు కొందరు భక్తులు. ఎంత దైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావ్.? నిబంధలు పట్టించుకోవా.? నువ్వేమైనా ప్రత్యేకమా.? అంటూ అర్చనా రవిచంద్రన్‌ పై కామెంట్స్ చేస్తున్నారు భక్తులు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..