‘వర్షం నచ్చదంటున్న’ విజయ్ ఆంటోని

'వర్షం నచ్చదంటున్న' విజయ్ ఆంటోని

విజయ్ ఆంటోని.. టాలీవుడ్‌లో ‘బిచ్చగాడు’ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. బిచ్చగాడు సినిమాలో అమ్మకు ప్రాణం అయినా ఇవ్వొచ్చు అనే పాత్రలో జీవించారనే చెప్పాలి. ఈ సినిమా టాలీవుడ్‌లో విజయ్ ఆంటోనీకి కాసుల వర్షం కురిపించింది. అప్పటి నుంచి వైవిధ్యభరితమైన పాత్రలను.. కథనాన్ని ఎంచుకుంటూ.. ముందుకు వస్తున్నారు. విజయ్ ఆంటోనీ సినిమా వస్తుందంటే.. అందులో ఏదో ఒక ట్విస్ట్.. ఉంటుందని ప్రేక్షకులు కూడా.. ఊహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్‌ ఆంటోని హీరోగా మరో సినిమా తమిళంలో రూపొందుతోంది. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 03, 2019 | 8:53 PM

విజయ్ ఆంటోని.. టాలీవుడ్‌లో ‘బిచ్చగాడు’ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. బిచ్చగాడు సినిమాలో అమ్మకు ప్రాణం అయినా ఇవ్వొచ్చు అనే పాత్రలో జీవించారనే చెప్పాలి. ఈ సినిమా టాలీవుడ్‌లో విజయ్ ఆంటోనీకి కాసుల వర్షం కురిపించింది. అప్పటి నుంచి వైవిధ్యభరితమైన పాత్రలను.. కథనాన్ని ఎంచుకుంటూ.. ముందుకు వస్తున్నారు. విజయ్ ఆంటోనీ సినిమా వస్తుందంటే.. అందులో ఏదో ఒక ట్విస్ట్.. ఉంటుందని ప్రేక్షకులు కూడా.. ఊహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్‌ ఆంటోని హీరోగా మరో సినిమా తమిళంలో రూపొందుతోంది. దీన్ని తెలుగులో కూడా అనువదించనున్నారు.

తమిళంలో ఆంటోని కొత్త సినిమా ‘మళై పిడిక్కాద మనిదన్’ అంటే.. వర్షం నచ్చని వ్యక్తి అని అర్థం. ఈ సినిమాను ఎంతో ఉత్కంఠభరితమైన కథాకథనాలతో తీస్తున్నారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆంటోని తెలిపారు. కాగా.. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో అల్లు శిరీష్ కనిపించనుండటం విశేషం. ఈ పాత్రతో తనకి మంచి పేరు వస్తుందని.. అంతేగాక ఈ కథ చాలా కొత్తగా ఉందని శిరీష్ తెలిపారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu