అలా లేకపోతే నిలవడం కష్టం.. లతాదీ షాకింగ్ కామెంట్స్

రాణు మొండల్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన గాయని. బాధాకరమైన ఆమె వ్యక్తిగత జీవితం నుంచి అందమైన రంగుల ప్రపంచంలోకి రాణు ప్రవేశించింది. ఆమెను బాలీవుడ్ సగౌరవంగా హత్తుకుంది. ఆమె స్వరానికి పులకించని భారతీయుడు లేడంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటిది రాణు మొండల్‌పై గాన కోకిల, ప్రఖ్యాత నేపథ్య గాయని లతా మంగేష్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో రాణు మొండల్ గురించి ప్రస్తావిస్తూ తాను గానం చేసిన ‘ ఏక్ ప్యార్ […]

అలా లేకపోతే నిలవడం కష్టం.. లతాదీ షాకింగ్ కామెంట్స్
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 2:50 PM

రాణు మొండల్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన గాయని. బాధాకరమైన ఆమె వ్యక్తిగత జీవితం నుంచి అందమైన రంగుల ప్రపంచంలోకి రాణు ప్రవేశించింది. ఆమెను బాలీవుడ్ సగౌరవంగా హత్తుకుంది. ఆమె స్వరానికి పులకించని భారతీయుడు లేడంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటిది రాణు మొండల్‌పై గాన కోకిల, ప్రఖ్యాత నేపథ్య గాయని లతా మంగేష్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో రాణు మొండల్ గురించి ప్రస్తావిస్తూ తాను గానం చేసిన ‘ ఏక్ ప్యార్ కా నగ్మా హై’ గీతంలో వెలుగులోకి వచ్చిన రాణును లతాదీ అభినందించారు. అయితే ఏ గాయకుడికైనా, గాయనికైనా సొంత ప్రతిభ ఉండాలని అది లేకపోతే అనతికాలంలోనే తెరమరుగవుతారని చెప్పారు. కాపీ కొట్టి పాడటం అనేది స్వల్ప కాలంలో మంచి గుర్తింపు ఇచ్చినా, కానీ అది దీర్ఘకాల ప్రయోజనాన్ని ఇవ్వదనే విషయాన్ని గుర్తించాలన్నారు లతా. తన సొంత చెల్లెలు ఆశా భోంస్లే కూడ తన సొంత శైలిని అలవర్చుకుని ఉండకపోతే ఎన్నడో మరుగున పడిపోయేదని చెప్పుకొచ్చారు.

కిషోర్ కుమార్, మమ్మద్ రఫీ,ముఖేశ్ వంటి సింగర్లను ఎంతోమంది అనుకరిస్తూ పాడుతుంటారు. కానీ కొంతకాలం తర్వాత వారు ఎవ్వరికీ గుర్తుండరు అందుకే సొంత శైలి అనేది అలవాటు చేసుకోవాలని సూచించారు. నేటి తరంలో ఎంతోమంది పిల్లలు ఎన్నో రియాలిటీ షోలలో పాడుతూ కనిపిస్తారు. వీరింతా లెజెండరీ సింగర్స్ పాడిన పాటలను పాడుతూ కనిపిస్తారు. కానీ అది ఎంతోకాలం నిలవదన్నారు ఈ లెజెండరీ సింగర్. నేటి తరం గాయనీల్లో శ్రేయా ఘోషల్,సునిధీ చౌహాన్ తమ సొంత శైలిలో పాడుతూ సినీ రంగంలో నిలదొక్కుకున్నారని పొగిడారు లతా మంగేష్కర్. తాను పాడిన పాట గానం చేసి పేరు తెచ్చుకోవడం, ప్రయోజన పొందడం సంతోషకరమే అయినా , ఎవరిమీద  ఎక్కువ రోజులు ఆధారపడవద్దని..ఎవరికి వారు  వ్యక్తిగత ప్రత్యేక  శైలిని ఏర్పాటు చేసుకుంటే ఎప్పటికైనా మంచిదని లతాదీ తన మనసులో మాటను చెప్పుకొచ్చారు.

రాణు మొండల్.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ రైల్వే స్టేషన్‌లో పాట పాడుతూ కనిపించగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. దీంతో ఆమెను మొట్టమొదట శంకర్ మహదేవన్ మెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ఒక పాట పాడే అవకాశాన్ని ఇచ్చారు. తేరీ..మేరీ.. మేరీ కహానీ అంటూ సాగే ఈ గీతం ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టిస్తోంది.