AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ఏ హీరో సాధించని ఫీట్..ప్రభాస్‌కి ‘సాహో’ అంటున్న బాక్సాఫీస్

ఇది మాములు మ్యాజిక్ కాదండి. డివైడ్.. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్లాప్ టాక్ వచ్చిన సినిమాకు కలెక్షన్లు అదరగొడుతున్నాయి. యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్​ హీరోగా నటించిన ‘సాహో’.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది. అసలు ఏం జరుగుతుందోొ బీ టౌన్ జనాలకు అర్ధం కావడంలేదు. సౌత్ సినిమాలకు, మన వాళ్ల కంటెంట్‌కు అక్కడి మాస్ జనాలు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఖాన్స్ హిట్టు కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తుంటే..మన వాళ్లు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. […]

ఇది ఏ హీరో సాధించని ఫీట్..ప్రభాస్‌కి 'సాహో' అంటున్న బాక్సాఫీస్
Saaho First Day Collections
Ram Naramaneni
|

Updated on: Sep 03, 2019 | 8:44 PM

Share

ఇది మాములు మ్యాజిక్ కాదండి. డివైడ్.. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్లాప్ టాక్ వచ్చిన సినిమాకు కలెక్షన్లు అదరగొడుతున్నాయి. యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్​ హీరోగా నటించిన ‘సాహో’.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది. అసలు ఏం జరుగుతుందోొ బీ టౌన్ జనాలకు అర్ధం కావడంలేదు. సౌత్ సినిమాలకు, మన వాళ్ల కంటెంట్‌కు అక్కడి మాస్ జనాలు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఖాన్స్ హిట్టు కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తుంటే..మన వాళ్లు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ ఏ స్టార్ అందుకోని ఫీట్ ఇది.  విడుదలైన నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్ల గ్రాస్​ వసూలు చేసిన ఈ చిత్రం.. మరో అరుదైన ఘనత సాధించింది. వైరల్డ్‌వైడ్‌గా వీకెండ్‌లో అత్యధిక మొత్తం సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఈ జాబితా టాప్​లో హాలీవుడ్​ చిత్రం ‘హాబ్స్ అండ్ షా’ ఉంది. తర్వాతి స్థానాల్లో ‘ద లయన్ కింగ్’, ‘వన్స్ అపాన్​ ఏ టైమ్​ ఇన్ హాలీవుడ్’, ‘ఏంజల్ హ్యాస్ ఫాలెన్’ ఉన్నాయి.

బాలీవుడ్​లో రూ.100 కోట్లకు చేరువలో ఉంది ‘సాహో’. అంటే అక్కడ సినిమా మంచి హిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని ‘సాహో’కి 1\2 రివ్యూ ఇచ్చిన ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. ప్రస్తుతం రూ.93.28 కోట్ల వసూళ్లతో సెంచరీ వైపు పరుగులు పెడుతోందీ చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్​గా శ్రద్ధా కపూర్ నటించింది. జాకీష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

Follow Us
ఉత్కంఠగా మ్యాచ్‌లో ఢిల్లీదే విజయం.. రాజస్థాన్ ఆశలు గల్లంతు
ఉత్కంఠగా మ్యాచ్‌లో ఢిల్లీదే విజయం.. రాజస్థాన్ ఆశలు గల్లంతు
పచ్చి మామిడి కాయతో ఆరోగ్యానికి పిచ్చి లాభాలు.. ఇవి తెలిస్తే..
పచ్చి మామిడి కాయతో ఆరోగ్యానికి పిచ్చి లాభాలు.. ఇవి తెలిస్తే..
నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్..
నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు..
ఆ హీరోతో వర్క్ చేసినప్పుడు చాలా గిల్టీగా ఫీలయ్యా..
ఆ హీరోతో వర్క్ చేసినప్పుడు చాలా గిల్టీగా ఫీలయ్యా..
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా
ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..
ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..
ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!
ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్
కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..
కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..