Ragini MMS3: ‘బిగ్’ హీరోయిన్‌గా భయపెట్టడానికి రెడీ అవుతున్న తార ఎవరో తెలుసా?
2011లో సన్నీ లియోన్‌తో మొదలై, 2014లో కేన్స్‌లో సైతం చర్చనీయాంశమైన రాగిణి MMS ఫ్రాంచైజీ… ఇప్పుడు మూడో భాగంతో థియేటర్లను మళ్లీ భయపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈసారి కథ కొత్త, స్కేల్ పెద్దది, భారీ బడ్జెట్… కానీ అసలు ట్విస్ట్ లీడ్ హీరోయిన్ ఎవరనేదే! ఈ ..

2011లో సన్నీ లియోన్‌తో మొదలై, 2014లో కేన్స్‌లో సైతం చర్చనీయాంశమైన రాగిణి MMS ఫ్రాంచైజీ… ఇప్పుడు మూడో భాగంతో థియేటర్లను మళ్లీ భయపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈసారి కథ కొత్త, స్కేల్ పెద్దది, భారీ బడ్జెట్… కానీ అసలు ట్విస్ట్ లీడ్ హీరోయిన్ ఎవరనేదే! ఈ విషయంపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బోల్డ్ & బ్యూటిఫుల్ రోల్ కోసం ఎక్తా టీమ్ ఒక టాప్ సౌత్ హీరోయిన్‌తో అడ్వాన్స్‌డ్ టాక్స్‌లో ఉందని తెలుస్తోంది. ఆమె గత రెండేళ్లుగా ఇమేజ్ షిఫ్ట్ చేస్తూ, వెబ్ సిరీస్‌ల్లో అడల్ట్ కంటెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా లెవెల్‌లో ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
అది ఎవరో కాదు.. టాలీవుడ్‌తోపాటు తన అందంతో బాలీవుడ్‌ని కూడా షేక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా! ‘ఓదెల 2’సినిమాలో బోల్డ్ లుక్‌లో అదరగొట్టిన తమన్నా రాగిణి MMS-3లో లీడ్ రోల్ ప్లే చేయడానికి సుముఖంగా ఉందని ఇన్సైడ్ టాక్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ చర్చలు చాలా పాజిటివ్ దిశలో సాగుతున్నాయట.
ఎక్తా కపూర్ ఈ ప్రాజెక్ట్‌ను థియేటర్ల కోసమే ప్లాన్ చేస్తోంది. OTT కేవలం హారర్ మాత్రమే కాదు, ఎరోటిక్ థ్రిల్లర్‌గా భారీ స్కేల్‌లో తెరకెక్కనుంది. ఒకవేళ తమన్నా ఫైనల్ అయితే ఆమె కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ రిస్క్ అయినా, బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్ కూడా అవుతుంది.

Tamannaag As Ragini
తమన్నా అంటే ముందు గుర్తొచ్చేది ఆమె అదిరిపోయే గ్లామర్, తర్వాత ఆమె డాన్స్! 2005లో ‘చంద్ సా రోషన్ చెహరా’తో డెబ్యూ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 85కి పైగా సినిమాల్లో నటించిన ఈ మిల్కీ బ్యూటీ… స్పెషల్ సాంగ్స్‌లో అయితే రికార్డులే సృష్టించింది. బోల్డ్ పాత్రలకి సై అంటున్న తమన్నా రాగిణి MMS 3కి ఓకే చెప్పిందనే తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్, ఓటీటీల్లో బోల్డ్ కంటెంట్ ప్రధాన ఎజెండాగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.
ఆ కోవలోనే వచ్చిన సినిమా ‘రాగిణి MMS 2’. ఇందులో శృంగార తార సన్నీలియోన్ రెచ్చిపోయి నటించింది. కమర్షియల్‌గానూ విజయం సాధించిన ఈ మూవీ సన్నీలియోన్‌కి బాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. మరి ఇప్పుడు రాగిణిగా తమన్నా ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి!




