అఖిల్‌ కోసం ‘సైరా’ టీమ్‌..!

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచురల్ చిత్రంలో నటిస్తోన్న అఖిల్‌.. ఆ తరువాత సురేందర్ రెడ్డి

  • Tv9 Telugu
  • Publish Date - 5:14 pm, Wed, 23 September 20
అఖిల్‌ కోసం 'సైరా' టీమ్‌..!

Akhil next movie: ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచురల్ చిత్రంలో నటిస్తోన్న అఖిల్‌.. ఆ తరువాత సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో నటించనున్నారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అఖిల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా కనిపించనున్నారట. కాగా ఈ మూవీకి వీఎఫ్‌ఎక్స్‌ పనులు భారీగా ఉండనుండగా.. సురేందర్ రెడ్డి, సైరా కోసం పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ టీమ్‌ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కోసం అనిల్ సుంకర 40కోట్ల బడ్జెట్‌ని పెట్టబోతున్నట్లు కూడా టాక్. ప్రస్తుతం అఖిల్‌కి అంత మార్కెట్ లేనప్పటికీ కథపై ఉన్న నమ్మకంతో ఈ మూవీకి భారీ బడ్జెట్‌ని పెట్టనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు..? ఈ మూవీ ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళ్లనుంది..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read More:

పునః ప్రారంభమైన ‘రంగ్‌దే’ షూటింగ్‌

Bigg Boss 4: వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న బబ్లీ హీరోయిన్‌..!