మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘యాత్ర’పై ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సురేందర్ రెడ్డి యాత్రపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించాడు.
‘‘యాత్రను చూశాను. ఇది నిజంగా భావోద్వేగంతో కూడిన ప్రయాణం. చాలా సన్నివేశాలలో భావోద్వేగానికి గురయ్యాను. మమ్ముట్టి గారు చాలా అద్భుతంగా నటించారు. తెరపైన రాజన్నను చూసిన అనుభూతిని కల్పించారు. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ సురేందర్ రెడ్డి కామెంట్ పెట్టాడు. మరోవైపు టాలీవుడ్ దర్శకుడు మారుతి, కోలీవుడ్ నటుడు సూర్య కూడా ఇప్పటికే యాత్రపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్యమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ అందరినీ ఆకట్టుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకుంటోంది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి