Hyderabad: హద్దు మీరాడు ఫలితం అనుభవించాడు.. సునిశిత్‌ను పొట్టు పొట్టు జోపిన హీరో ఫ్యాన్స్. అసలేం జరిగిందంటే.
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వారికి సునిశిత్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, తనకు తాను ఓ స్టార్ హీరో అంటూ గొప్పలు చెప్పుకునే సునిశిత్ నెట్టింట చేసే రచ్చ మాములుగా ఉండదు. పలాన సినిమా నేను చేయాల్సిందని, పలాన హీరోయిన్ నాతో డేటింగ్ చేసిందంటూ ఇలా ఏది పడితే...
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వారికి సునిశిత్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, తనకు తాను ఓ స్టార్ హీరో అంటూ గొప్పలు చెప్పుకునే సునిశిత్ నెట్టింట చేసే రచ్చ మాములుగా ఉండదు. పలాన సినిమా నేను చేయాల్సిందని, పలాన హీరోయిన్ నాతో డేటింగ్ చేసిందంటూ ఇలా ఏది పడితే అది మాట్లాడుతూ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాడు.
అయితే ఇదే సమయంలో కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ అభిమానుల అగ్రహానికి కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఓ స్టార్ హీరోయిన్ తనతో డేటింగ్ చేసిందని చెప్పిన సునిశిత్‌పై లీగల్ కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి తలతిక్క మాటలు మాట్లాడాడు సునిశిత్. అయితే ఈసారి అగ్రహించిన ఫ్యాన్స్ మనోడికి బడిత పూజ చేశారు.
అసలేం జరిగిందంటే.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునిశిత్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఓ అగ్ర హీరో సతీమణితో తనకు ఫ్రెండ్ అని, ఆమెకు ఒక ఎలెక్ట్రిక్ కారు ఉందన్న సునిశిత్.. ఆ కారులో ఇద్దరు గోవా కూడా వెళ్లామని చెప్పుకొచ్చాడు. దీంతో సునిశిత్ చేసిన ఈ వ్యాఖ్యలకు అగ్రహించిన సదరు హీరో ఫ్యాన్స్ సునిశిత్ ను చితకబాదారు. అనంతరం అతనితో క్షమాపణ చెప్పించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..