సునీల్‌కు మెగాస్టార్ బ్లెస్సింగ్స్..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆయన ఈ చిత్రం పూర్తి చేసిన తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డాడు కొరటాల. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరో కమ్ కమెడియన్ సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే గతంలో ఖైదీ నెంబర్ 150లో నటించే అవకాశం సునీల్ ను వరించగా.. […]

సునీల్‌కు మెగాస్టార్ బ్లెస్సింగ్స్..?
Follow us

|

Updated on: Apr 16, 2019 | 5:16 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆయన ఈ చిత్రం పూర్తి చేసిన తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డాడు కొరటాల.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరో కమ్ కమెడియన్ సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే గతంలో ఖైదీ నెంబర్ 150లో నటించే అవకాశం సునీల్ ను వరించగా.. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఆఫర్‌ను వదులుకున్నాడు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తో కలిసి నటించే అవకాశం రావడంతో సునీల్ చాలా హ్యాపీ గా ఉన్నాడట. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ,మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.