సందీప్ కిషన్ ‘రౌడీ బేబీ’ సినిమా షూటింగ్ స్టార్ట్.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్.. నవ్వించడానికి వస్తోన్న హీరో..

హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న సినిమా రౌడిబేబీ.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు

సందీప్ కిషన్ 'రౌడీ బేబీ' సినిమా షూటింగ్ స్టార్ట్.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్.. నవ్వించడానికి వస్తోన్న హీరో..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2020 | 2:35 PM

హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న సినిమా రౌడిబేబీ.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తు్న్నారు. డిసెంబర్ 16న ఈ సినిమా షూటింగ్‏ను ప్రారంభించారు. మూవీ సహ నిర్మాత జీవీ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎంవీవీ సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మరగాని భరత్, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్ రాజ్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే అమర్ నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఈ సినిమా డైరెక్టర్ కోన వెంకట్ మాట్లాడుతూ.. “కామెడీ సినిమాలతో నా కెరిర్‏ను ప్రారంభించి స్టార్ రైటర్‏గా ఎదిగాను. ప్రస్తుతం అదే కామెడీతో మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి రాబోతున్నాం” అని అన్నారు. అనంతరం వైజాగ్ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. “ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ బుధవారం ప్రారంభించాం. విశాఖపట్నం చుట్టూ పక్కల ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్‏లో ఈ సినిమాను పూర్తిచేసి, వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాం” అని అన్నారు.