AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న ‘మేజర్’ ఫస్ట్ లుక్… కమాండో పాత్రలో అడివి శేష్ లుక్ సూపర్. అడివి శేష్‌పై మహేష్ ప్రశంసలు.

‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న అడివి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

ఆకట్టుకుంటోన్న ‘మేజర్’ ఫస్ట్ లుక్... కమాండో పాత్రలో అడివి శేష్ లుక్ సూపర్. అడివి శేష్‌పై మహేష్ ప్రశంసలు.
Narender Vaitla
|

Updated on: Dec 17, 2020 | 3:14 PM

Share

adivi sesh major first look: ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న అడివి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నిజానికి ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకోవాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది. అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా (డిసెంబర్ 17) ‘మేజర్’ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో అడివి శేష్ చేతిలో గన్‌తో ఇంటెన్సివ్ లుక్‌తో కనిపిస్తున్నారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా మేజర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్‌ పోస్ట్ చేసిన ప్రిన్స్.. ‘మేజర్ ఫస్ట్ లుక్‌ను ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అడివి శేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మేజర్‌లో నీ నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక మేజర్ చిత్రానికి అడివి శేష్ కథ అందించగా… సోనీ ఫిల్మ్స్ ఇండియా, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మేజర్‌తో అడివి శేష్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!