నిహారికతో సుకుమార్ చిత్రం..?

నిహారికతో సుకుమార్ చిత్రం..?

‘ఆర్య’ చిత్రం నుంచి మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక గతేడాది రామ్ చరణ్‌తో సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ భారీ విజయం సాధించడంతో.. ఆ ఫ్యామిలీ అతడికి ప్రత్యేక స్థానం ఇచ్చింది. దీంతో ఆ కుటుంబంలోని హీరోలతో వరుస సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు సుకుమార్. దర్శకుడిగా కాకపోయినా.. వారి చిత్రాలకు కథలు అందించడం, నిర్మించడం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సుకుమార్.. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 15, 2019 | 3:42 PM

‘ఆర్య’ చిత్రం నుంచి మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక గతేడాది రామ్ చరణ్‌తో సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ భారీ విజయం సాధించడంతో.. ఆ ఫ్యామిలీ అతడికి ప్రత్యేక స్థానం ఇచ్చింది. దీంతో ఆ కుటుంబంలోని హీరోలతో వరుస సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు సుకుమార్. దర్శకుడిగా కాకపోయినా.. వారి చిత్రాలకు కథలు అందించడం, నిర్మించడం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సుకుమార్.. మరో చిత్రానికి నిహారికను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల నిహారికకు సుకుమార్ ఓ కథను వినిపించడం.. అందుకు ఆమె వెంటనే ఒప్పుకోవడం జరిగిపోయాయట. ఈ చిత్రానికి సుకుమార్ అసిస్టెంట్ దర్శకత్వం వహించనుండగా.. గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్‌తో కలిపి సుకుమార్ నిర్మించనున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. కాగా నిహారిక ప్రస్తుతం ప్రణీత్ దర్శకత్వంలో ‘సూర్యకాంతం’లో నటిస్తుండగా.. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu