ఆ హీరో చేతుల్లోకి ‘సైరా’ హిందీ రైట్స్..!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఈ సినిమాపై బాలీవుడ్‌లో కూడా పాజిటివ్ బజ్ ఉంది. కాగా తాజా సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ‘సైరా’ […]

ఆ హీరో చేతుల్లోకి 'సైరా' హిందీ రైట్స్..!
Follow us

|

Updated on: May 27, 2019 | 9:03 PM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఈ సినిమాపై బాలీవుడ్‌లో కూడా పాజిటివ్ బజ్ ఉంది.

కాగా తాజా సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ‘సైరా’ సినిమా హిందీ హక్కులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు సమాచారం. నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.