Alluri Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు ‘అల్లూరి’.. ఎక్కడ చూడచ్చంటే.!
ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన 'అల్లూరి' మూవీ. ఆహాలో అక్టోబర్ 7వ తేదీ రాత్రి 8 గంటల నుంచి..
రొటీన్‌కు భిన్నంగా సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘అల్లూరి’. దీనికి దర్శకుడు ప్రదీప్ వర్మ కాగా.. ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ సినిమా కథాంశాం తిరుగుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 7వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో విడుదలైన రెండు వారాలలోపే ఈ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సింహ కోడూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Alluri. Athaniki oka style undi. Case ni handle chese vidhananiki oka meter undi. Okkasari bari loki digithe, raccha ne?#AlluriOnAHA Premieres tomorrow @ 8pm @sreevishnuoffl pic.twitter.com/ju1qu9rEmQ
— ahavideoin (@ahavideoIN) October 6, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..