ఒకప్పటి మిస్ ఇండియా, బాలీవుడ్ స్టార్.. తర్వాత బీ గ్రేడ్ మూవీస్‌లోకి..! ఆ ఒక్కటే ఆమెకు శాపమైంది!
సోను వాలియా, 1985 ఫెమినా మిస్ ఇండియా, తన అందంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రేఖకు పోటీగా నిలిచింది కానీ, అధిక ఎత్తు కారణంగా అవకాశాలు కోల్పోయింది. హీరోలు, హీరోయిన్లు ఆమెతో పనిచేయడానికి ఇష్టపడకపోవడంతో బి-గ్రేడ్ సినిమాల వైపు వెళ్ళింది. ప్రస్తుతం ఆమె నిర్మాణ రంగంలో ఉంది.

1970 నుంచి 1990 మధ్య ఎంతో మంది అందాల భామలు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంతమంది స్టార్లుగా ఎదిగితే.. మరికొందరు అలా మెరిసి ఇలా మాయమైపోయారు. అయితే.. ఈ రెండు కాకుండా ఇంకో కోవకు చెందిన హీరోయిన్ ఉంది. ఆమె మిస్ ఇండియా.. తన అందం, నటనతో అప్పటికే బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న రేఖకు గట్టి పోటీ ఇచ్చింది. బాలీవుడ్‌ను ఏలేస్తుందని అనిపించింది. కానీ, దేవుడు ఆమెకిచ్చిన ఎత్తు ఆమెకు శాపమైంది. బాలీవుడ్‌లో మెరిసి.. ఆ తర్వాత బీ గ్రేడ్ చిత్రాల్లో నటించిన ఒకప్పటి మిస్ ఇండియా సోను వాలియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సోను వాలియా అసలు పేరు.. సంజిత్ కౌర్ వాలియా. బాలీవుడ్‌లో ఆమె చాలా చిత్రాలలో సైడ్ రోల్స్‌లో కనిపించింది. 1985లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేఖ, కబీర్ బేడీలతో కలిసి ‘ఖూన్ భరీ మాంగ్’లో నటించింది. ఈ చిత్రంలో ఆమెకు ఫేమ్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, దివ్య భారతి నటించిన ‘దిల్ ఆష్నా హై’లో కూడా నటించింది. అయితే చాలా మంది బాలీవుడ్ తారలు సోనుతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు. అందుకు కారణం ఆమె ఎత్తు.
ఆమె చాలా పొడుగ్గా ఉండేది దీంతో ఆమె పక్కన తాము చాలా పొట్టిగా కనిపిస్తామని, హీరోలు రిజక్ట్ చేసేవారు. పోనీ సైడ్ క్యారెక్టర్లు చేద్దామంటూ.. హీరోయిన్లు కూడా ఆమె పక్కన పొట్టిగా కనిపిస్తామని వాళ్లు కూడా ఆమెను వద్దనే వారు. అలా ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో ఆమె బి-గ్రేడ్ చిత్రాలలో పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత సోను అమెరికాలో నివసిస్తున్న ఎన్నారై సూర్య ప్రతాప్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఆయన 2009లో మరణించారు. ప్రస్తుతం, సోను నటనకు పూర్తిగా దూరంగా ఉంటూ ఒక నిర్మాణ సంస్థతో కలిసి పనిచేస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



