చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. మనలో ఉన్న చిన్న పిల్లవాడిని కౌగిలించుకోవాలన్న శ్రుతిహాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శృతిహాసన్. ఈ బ్యూటీ నటిగానే కాకుండా సింగర్ గాను తన సత్తా చాటుకుంటుంది.

చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. మనలో ఉన్న చిన్న పిల్లవాడిని కౌగిలించుకోవాలన్న శ్రుతిహాసన్
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 21, 2020 | 4:47 PM

లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శృతిహాసన్. ఈ బ్యూటీ నటిగానే కాకుండా సింగర్ గాను తన సత్తా చాటుకుంటుంది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతూ బిజీగా ఉంది. తాజాగా తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది శృతిహాసన్. స్కూల్ డేస్ లో వైట్ అండ్  వైట్ యూనిఫామ్ లో చాలా క్యూట్ గా ఉంది శ్రుతిహాసన్. ఈ ఫోటోను తన ఇన్ స్టా లో పోస్ట్ చేస్తూ ఓ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. ” మినీ మీ.. ఆ కళ్ళలో ఆ గుండెలో కలలు .. చాలా గట్టిగా వినిపించే గొంతు.! అన్ని నిజంగా మారిపోయాయి. పిల్లల్లో సహజంగా ఉండే అమాయకత్వాన్ని మీలో సజీవంగా ఉంచడం చాలా కష్టము. మనమందరం మనలో ఉన్న చిన్న పిల్లవాడిని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకోవాలి. కాబట్టి మీలోని మినీకి హాయ్ చెప్పండి. అందంగా ఎంతో బావుంటుంది..“ అంటూ రాసుకొచ్చింది శృతిహాసాన్ ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.