రెగ్యులర్ షూట్ స్టార్ట్….. ప్రారంభమైన శ్యామ్ సింగ రాయ్ చిత్రీకరణ.. నాని, కృతిపై టాకీ సీన్లు…

శ్యామ్ సింగ రాయ్‌ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ అఫిషియ‌ల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ పిక్చర్ షేర్ చేసింది.

రెగ్యులర్ షూట్ స్టార్ట్..... ప్రారంభమైన శ్యామ్ సింగ రాయ్ చిత్రీకరణ.. నాని, కృతిపై టాకీ సీన్లు...
Follow us

| Edited By:

Updated on: Dec 21, 2020 | 2:57 PM

శ్యామ్ సింగ రాయ్‌ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ అఫిషియ‌ల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ పిక్చర్ షేర్ చేసింది. అందులో ఓ టేబుల్‌పై శ్యామ్ సింగ రాయ్ స్క్రిప్ట్ బుక్‌, దాని ప‌క్కనే ఓ టీ క‌ప్పు ఉన్నాయి. ఆ టేబుల్ అవ‌త‌ల చైర్‌లో నాని కూర్చొని ఉన్నాడు. ఆ పిక్చర్‌తో పాటు “రాయ్ స్టార్ట్స్ రోలింగ్‌.. త‌గిన భ‌ద్రతా చ‌ర్యలు తీసుకుంటూ నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న మా స్పెష‌ల్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ తొలి ద‌శ షూటింగ్ ప్రారంభించాం” అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసింది.

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్‌’. సాయిప‌ల్లవి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

moఈ సినిమాని ఎనౌన్స్ చేసిన ద‌గ్గర్నుంచి ప్రేక్షకుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీలో ఇప్పటివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్రను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న కొత్తగా మేకోవ‌ర్ అయ్యారు కూడా. కాగా, ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. నాని, నాయిక‌ల్లో ఒక‌రైన కృతి శెట్టిపై టాకీ సీన్లు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్రన్‌, ముర‌ళీ శ‌ర్మ, అభిన‌వ్‌ గోమ‌టం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి స‌త్యదేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చగా, మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.