చిరు సినిమాలో శృతి..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ ఒక కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలు శృతి ని సంప్రదించగా.. ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే శృతి హాసన్ […]

చిరు సినిమాలో శృతి..?
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 14, 2019 | 11:04 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ ఒక కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలు శృతి ని సంప్రదించగా.. ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది ఇలా ఉంటే శృతి హాసన్ గత రెండేళ్లగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘హలో సాగో’ అనే టీవీ షో చేస్తోంది. ఇదే కాకుండా ఆమె పలు హిందీ చిత్రాలకు కూడా సైన్ చేసినట్లు వినికిడి. లేటెస్ట్ గా విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కించబోయే చిత్రంలో కూడా హీరోయిన్ గా శృతినే ఎంపిక చేశారట.

మరోవైపు సైరాలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, నయనతార, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్, తమన్నా, మరియు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.