ఆ హీరోయిన్ కొత్త చిత్రానికి ఇంటరెస్టింగ్ టైటిల్..!

తమిళ చిత్రం ‘కనా’తో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కె.ఎస్.రామారావు తనయుడు వల్లభ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దు గుమ్మ. తాజా సమాచారం ప్రకారం ఈమె ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిందట. ఆ […]

ఆ హీరోయిన్ కొత్త చిత్రానికి ఇంటరెస్టింగ్ టైటిల్..!
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:18 PM

తమిళ చిత్రం ‘కనా’తో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కె.ఎస్.రామారావు తనయుడు వల్లభ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దు గుమ్మ.

తాజా సమాచారం ప్రకారం ఈమె ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిందట. ఆ సినిమా నిన్న రాజమండ్రిలో పూజా కార్యక్రమాలు జరుపుకుని గ్రాండ్ గా లాంచ్ అయింది. భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానికి ‘కౌసల్య కృష్ణమూర్తి- క్రికెటర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కార్తీక్ రాజు హీరోగా నటిస్తుండగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఐశ్వర్య తండ్రి పాత్రలో మెరవనున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ క్రికెటర్ పాత్రలో కనిపిస్తారట. ఇంక ఇది ఆమె తమిళంలో నటించిన ‘కనా’ రీమేక్ అని వినికిడి.