ఫొటోకు ఫోజ్ ఇవ్వమంటే ఇలానే చూస్తాడు: అకీరా గురించి రేణు
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తిని కనబరుస్తారు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు రేణు దేశాయ్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అకీరా ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా అకీరాకు సంబంధించిన ఓ ఫొటోను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘అకీరాను ఫొటోకు ఫోజ్ ఇవ్వమని అడిగితే తనకు ఇలాంటి స్పెషల్ లుక్‌లు’’ వస్తాయి అంటూ ఆమె కామెంట్ పెట్టింది. కాగా పవన్‌తో విడాకుల […]
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తిని కనబరుస్తారు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు రేణు దేశాయ్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అకీరా ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా అకీరాకు సంబంధించిన ఓ ఫొటోను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘అకీరాను ఫొటోకు ఫోజ్ ఇవ్వమని అడిగితే తనకు ఇలాంటి స్పెషల్ లుక్‌లు’’ వస్తాయి అంటూ ఆమె కామెంట్ పెట్టింది. కాగా పవన్‌తో విడాకుల తరువాత పిల్లలిద్దరు(అకీరా, ఆద్య) రేణు దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. వారి కోసం అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ పుణెకు వెళుతుంటారు. అలాగే రేణు కూడా అకీరా, ఆద్యలను మెగా హైదరాబాద్‌కు పంపుతూ ఉంటారు.