AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమన్యుడికి జోడిగా శ్రద్ధ.?

నానికి జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ‘జెర్సీ’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పాటు ఆమె తమిళంలో నటించిన ‘కె 13’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆమెకు హీరో విశాల్ నటించే కొత్త చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. విశాల్ గతంలో నటించిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇరుంబు తిరై’కు ఈ చిత్రం సీక్వెల్ […]

అభిమన్యుడికి జోడిగా శ్రద్ధ.?
Ravi Kiran
|

Updated on: May 13, 2019 | 7:58 PM

Share

నానికి జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ‘జెర్సీ’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పాటు ఆమె తమిళంలో నటించిన ‘కె 13’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆమెకు హీరో విశాల్ నటించే కొత్త చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

విశాల్ గతంలో నటించిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇరుంబు తిరై’కు ఈ చిత్రం సీక్వెల్ గా రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేశారట. అయితే దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. పిఎస్. మిత్రన్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Follow Us