‘మహాసముద్రం’లోకి మాస్‌రాజా..?

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండవ సినిమాకు ‘మహాసముద్రం’ అనే కథ రాసుకున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా మొదట అక్కినేని నాగచైతన్యతో చేద్దాం అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే నాగ చైతన్య తర్వాత పలు యంగ్ హీరోల పేర్లు వినిపించినా.. అవన్నీ పుకార్లేనని దర్శకుడు కొట్టి పారేశాడు. ఇకపోతే తాజాగా సీనియర్ హీరో రవితేజకు అజయ్ ఈ స్క్రిప్ట్ వినిపించినట్లు […]

  • Ravi Kiran
  • Publish Date - 8:24 pm, Mon, 13 May 19
'మహాసముద్రం'లోకి మాస్‌రాజా..?

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండవ సినిమాకు ‘మహాసముద్రం’ అనే కథ రాసుకున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా మొదట అక్కినేని నాగచైతన్యతో చేద్దాం అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే నాగ చైతన్య తర్వాత పలు యంగ్ హీరోల పేర్లు వినిపించినా.. అవన్నీ పుకార్లేనని దర్శకుడు కొట్టి పారేశాడు.

ఇకపోతే తాజాగా సీనియర్ హీరో రవితేజకు అజయ్ ఈ స్క్రిప్ట్ వినిపించినట్లు తెలుస్తోంది. కథ కూడా రవితేజకు నచ్చిందని వినికిడి. ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్‌లో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు మాస్ మహారాజా. మరి ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి స్టోరీకి ఓకే చెబుతాడా లేదా అనేది వేచి చూడాలి.