షకీలా బయోపిక్ ట్రైలర్ చూశారా?.. ‘సిల్క్ స్మిత తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న నటి.. షకీలానే’.

ఇటీవల భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై బయోపిక్‌ల హవా నడుస్తోంది. రాజకీయ నాయకులతో మొదలు పెడితే సినిమా తారల వరకు అందరి జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’తో ఇండస్ట్రీ ఒక్కసారి ఉలిక్కిపడింది.

షకీలా బయోపిక్ ట్రైలర్ చూశారా?.. ‘సిల్క్ స్మిత తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న నటి.. షకీలానే’.
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Jun 22, 2021 | 4:37 PM

shakeela trailer out: ఇటీవల భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై బయోపిక్‌ల హవా నడుస్తోంది. రాజకీయ నాయకులతో మొదలు పెడితే సినిమా తారల వరకు అందరి జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’తో ఇండస్ట్రీ ఒక్కసారి ఉలిక్కిపడింది. సిల్క్ జీవితంలోని చీకటి కోణాలను ఇందులో చూపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు కాంట్రవర్సీలకూ దారి తీసింది. ఇదిలా ఉంటే తాజాగా మరో శృంగార తార జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుంది. ఒకప్పుడు తన హాట్ నటనతో ప్రేక్షకుల‌ను ఉర్రూతలూగించిన నటి షకీలా జీవిత కథ ఆధారంగా ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘షకీలా’ టైటిల్‌తో రానున్న ఈ సినిమాలో రిచా చద్దా షకీలా పాత్రలో నటించనున్నారు. ఇక రిచాతో పాటు పంకజ్ త్రిపాఠి, ఎస్తేర్ నోరోన్హా, షీవా రానా, రాజీవ్ పిళ్లై కీలకపాత్రలో నటిస్తున్నారు.

తాజాగా చిత్ర యూనిట్ షకీలా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ అద్యంతం ఆకట్టుకుంటోంది. పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన ఓ నటీమణి సూపర్ స్టార్‌గా ఎలా ఎదిగిందన్న కథాంశంతో సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సిల్క్ స్మిత ఆత్మహత్యతో ట్రైలర్ మొదలవగా.. సిల్క్ తర్వాత అంతటి గుర్తింపు సంపాదించుకున్న శృంగార తార షకీలానే అని చూపించారు. షకీలా.. బాల్యం, విద్య, సినిమాల్లో నటించడానికి సిటీకి వచ్చి పడ్డ కష్టాలు, పోర్న్ స్టార్‌గా ఎలా మారిందన్న విషయాలను ట్రైలర్‌లో ప్రస్తావించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి ‘షకీలా’ మరో ‘డర్టీ పిక్చర్’ అవుతుందా.? ఎలాంటి కాంట్రవర్సీలకు దారి తీస్తుందో చూడాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu