సినీ పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేసిన ఆ హీరోయిన్.. అలాంటివి చూడడం దురదృష్టకరమంటున్న నటి దియా మీర్జా..

సినీ పరిశ్రమపై నటి దియామీర్జా మరోసారి విమర్శలు గుప్పించింది. సినీ ఇండస్ట్రీలో ఇంకా పురుషాధికారం కొనసాగుతుందని ఆమె అన్నారు. వయసు అయిపోయిన హీరోలతో అతితక్కువ వయసున్న హీరోయిన్స్

సినీ పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేసిన ఆ హీరోయిన్.. అలాంటివి చూడడం దురదృష్టకరమంటున్న నటి దియా మీర్జా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2020 | 4:20 PM

సినీ పరిశ్రమపై నటి దియామీర్జా మరోసారి విమర్శలు గుప్పించింది. సినీ ఇండస్ట్రీలో ఇంకా పురుషాధికారం కొనసాగుతుందని ఆమె అన్నారు. వయసు అయిపోయిన హీరోలతో అతితక్కువ వయసున్న హీరోయిన్స్ నటించడం చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తుందని నటి దియామీర్చా విమర్శించారు. గతంలో కూడా దియా సినీ పరిశ్రమ పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కొత్తగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినా తాను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నానని.. ముఖ్యంగా దక్షిణ సినీ పరిశ్రమలో చాలా అవమానాలు భరించానని అప్పట్లో వ్యాఖ్యలు చేశారు.

కాగా ఇప్పుడిప్పుడే సినీపరిశ్రమలో ఆడవాళ్ళకు కాస్తా గుర్తింపు లభిస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. “జీవితంలో అందం అనేది వయసుతో ముడిపడి ఉంటుంది. అందుకోసమే ప్రతిసారీ కొత్త హీరోయిన్స్‏ను చిత్రపరిశ్రమలోకి తీసుకువస్తుంటారు. కానీ ఇక్కడ పురుషాధికారం ఎక్కువగా ఉంటుంది. వయసు మళ్ళిన హీరోలు ఇంకా మెయిన్ రోల్స్‏లో నటిస్తున్నారు. కానీ స్త్రీలకు మాత్రం ప్రధాన పాత్రలు ఇవ్వరు. వయసు పైబడిన హీరోలు ఇంకా ప్రధాన పాత్రలలో నటిస్తుండడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఇక్కడ 50 ఏళ్ళ హీరోలతో 19 సంవత్సరాల అమ్మాయిలు హీరోయిన్స్‏గా నటించడం చూస్తుంటే చాలా వింతగా ఉంటుంది” అని దియామీర్చా తెలిపారు.